ఆ ఉపాధ్యాయునుల కృషే..ఆ ప్రభుత్వ పాఠశాల


ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపే తల్లిదండ్రులు కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. కడప జిల్లా మైదుకూరు మండలం సరస్వతి పాఠశాల దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. మూడేళ్ల కిందట 13 మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలో ఇప్పుడు 37 మంది విద్యార్థులున్నారు. మూతపడే స్థాయిలో ఉన్న ఆ పాఠశాలపై..అక్కడి ఉపాధ్యాయురాలు పద్మజ ప్రత్యేక దృష్టిసారించారు. తల్లిదండ్రులను ఒప్పించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేలా చేశారు. ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు కృషి ఫలితంగా ఈ ఏడాది 37 మంది విద్యార్థులకు చేరుకున్నారు. దాతల సహాయాన్ని తీసుకుని... బల్లలు, పాఠశాలకు రంగులు, దేశనాయకుల చిత్రాలు ,ఆంగ్ల తెలుగు హిందీ పదాలు గోడలపై రాయించారు. పాఠశాలను ఆదర్శంగా తయారు చేసేందుకు ఉపాధ్యాయుల కృషిని తల్లిదండ్రులు మెచ్చుకుంటున్నారు. వచ్చే ఏడాది గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా కృషి చేస్తున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆ ఉపాధ్యాయునుల కృషే..ఆ ప్రభుత్వ పాఠశాల"

Post a Comment