జాబిలమ్మపై విక్రమ్‌ ల్యాండింగ్‌ నాసా పంపిన ఫోటోలు?

జాబిల్లిని అందుకోవాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చంద్రయాన్ 2. ఇస్రో జూలై 22న చంద్రయాన్ 2ను ప్రతిష్టాత్మకంగా ప్రయోగించింది. అన్ని కక్ష్యల్లోనూ విజయవంతంగా దూసుకెళ్లిన చంద్రయాన్ 2 చంద్రుడి కక్ష్యకు మరో 2.1 కి.మీ దూరంలో ఉందనగా విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోయాయి. ఈ నెల 7న చంద్రుడి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగుతూ విక్రమ్‌ ల్యాండర్‌ గల్లం‍తైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై దిగుతున్న సమయంలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో విక్రమ్‌ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి.



దాంతో అందరూ నిరుత్సహాంలో ఉండగా..విక్రమ్ ల్యాండర్ అక్కడే చక్కర్లు కొడుతుందని మరో వార్త రావడంతో ఏదైనా మంచి వార్త వస్తుందేమో అని అందరూ ఎదురు చూశారు


కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ఇస్రో, అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రయత్నించినప్పటికీ.. అది సఫలం కాలేదు. అయితే చంద్రయాన్ 2లో చంద్రుడిపై దిగి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసే విక్రమ్ ల్యాండర్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో కేవలం చంద్రుడికి రెండు కిలోమీటర్ల దూరంలో అగిపోయింది. అసలు విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయిందా లేదా అని ఇంతకాలం సందిగ్ధం నెలకొంది.

తాజాగా చంద్రయాన్2లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై గట్టిగా ఢీకొట్టిందని అమెరికా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. చంద్రయాన్‌2 నుంచి వేరయిన విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై హార్డ్‌ ల్యాండింగ్‌ చేసిందని ,అందుకు సంబంధించిన హైరిజల్యూషన్‌ ఫొటోలను శుక్రవారం నాసా విడుదల చేసింది. వాస్తవానికి ఈ నెల 17న తీసినట్లు తెలిపారు. కాకపోతే అక్కడ అంతా చీకటిగా ఉండటంతో ల్యాండింగ్ ప్రదేశాన్ని గుర్తించలేకపోయామని శాస్త్రవేత్తలు 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జాబిలమ్మపై విక్రమ్‌ ల్యాండింగ్‌ నాసా పంపిన ఫోటోలు?"

Post a Comment