'విక్రమ్' నుంచి నిలిచిన సంకేతాలు
ప్రధాని భరోసా..
ల్యాండర్ నుంచి సంకేతాలు అందడం లేదని ప్రకటించినప్పుడు ఇస్రో ఛైర్మన్ శివన్ ఒకింత ఉద్విగ్నానికి లోనయ్యారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఇస్రో శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు. జీవితంలో ప్రతి ప్రక్రియలో జయాపజయాలు సాధారణమని, మీరు సాధించింది తక్కువేమీ కాదని మోదీ అన్నారు. భవిష్యత్‌పై ఆశావహ దృక్పథంలో ముందకు సాగుదామని శాస్త్రవేత్తలకు సూచించారు. భవిష్యత్‌లో విజయాన్ని అందుకుంటారన్న విశ్వాసం తనకుందన్నారు. దేశం మొత్తం మీ వెంటే ఉందని ధైర్యం చెప్పారు. తనతో పాటు ప్రయోగాన్ని వీక్షించేందుకు బెంగళూరులోని ఇస్రో కేంద్రానికి వచ్చిన చిన్నారులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు
Additional information
- 2.1 కిలోమీటర్ల దూరంలో ఆగిన ల్యాండర్
- జాబిల్లి యాత్రకు సాంకేతిక సమస్యలు
- చంద్రయాన్-2 కారణాలను విశ్లేషిస్తాం : ఇస్రో చైర్మెన్ కె.శివన్
- ధైర్యం కోల్పోవద్దు.. దేశం మీ వెంటే ఉంది : మోడీ
నరాలు తెగేంత ఉత్కంఠ.. 1.52 గంటలకు జాబిల్లిపై రోవర్ విక్రమ్ అడుగుపెడుతున్నదనీ.. దేశ,విదేశాలు ఉత్కంఠంగా ఎదురుచూశాయి. ప్రధాని మోడీ కూడా ఇస్రో ప్రధానకార్యాలయానికి చేరుకోవటంతో టెన్షన్.టెన్షన్. చంద్రయాన్..2 కు కౌంట్ డౌన్ షురూ అయింది. ఊపిరి బిగపట్టి.. చేతుల్లో హ్యాండ్ మైకులతో జాబిల్లి వైపు శాస్త్రవేత్తలు స్క్రీన్లవైపు నిశితంగా గమనిస్తూనే ఉన్నారు
బెంగళూరు : అందినట్టే అందిన చందమామ చివరిక్షణాల్లో జారిపోయాడు. 48 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని, ఆటుపోట్లను ఎదుర్కొని చంద్రునిపైకి చేరిన చంద్రయాన్-2 చివర్లో తడబాటుకు గురైంది. చంద్రుని ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ రోవర్ ఆ దిశలో ప్రయాణం ప్రారంభించిన కాసేపటికే ఆటంకాలను ఎదుర్కొంది. తొలిదశలో సజావుగానే అందిన సంకేతాలు మలిదశ ప్రారంభమైన కాసేపటికే విక్రమ్ నుంచి నిలిచిపోయాయి. దీంతో బెంగళూరులోని ఇస్ట్రాక్‌లో నరాలు తెగే ఉత్కంఠ! చంద్రుడికి 2.1 కిలోమీటర్ల వద్ద ల్యాండర్ (విక్రమ్) నుంచి సంకేతాలు ఆగిపోవడంతో అప్పటివరకూ అంతా సవ్యంగా సాగుతున్న నూట ముప్పై కోట్ల ప్రజల ప్రతినిధి జాబిల్లి యాత్ర.. రెండడుగుల దూరంలో ఆగిపోయింది. ప్రధాని మోడీ సహా ఇస్రో శాస్త్రవేత్తలు, దేశ ప్రజలు నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షిస్తున్న సమయంలో ల్యాండర్ నుంచి సంకేతాలు రావడం నిలిచిపోయాయి. చివరి దశలో ల్యాండర్‌లో సమస్య తలెత్తడంతో వాహననౌక నుంచి సిగల్స్ తెగిపోయాయి. దీంతో అందరి ముఖాల్లోనూ అప్పటిదాకా ఉన్న నవ్వు మాయమై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. దాదాపు అరగంట వరకూ వేచి చూసిన అనంతరం.. ఉద్విగ వాతావరణంలో ఇస్రో చైర్మన్ కె.శివన్ మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల ల్యాండర్ నుంచి సంకేతాలు కోల్పోయామనీ, పరిస్థితులను విశ్లేషిస్తున్నామని ప్రకటించారు. అనంతరం మోడీ వారిదగ్గరకు వచ్చి మాట్లాడారు. 'మీరు సాధించింది తక్కువేం కాదు. ధైర్యం కోల్పోవద్దు. యావత్ దేశం మొత్తం మీ వెంటే ఉంది. భవిష్యత్తుపై ఆశావాహా దృక్పథంతో ఉండండి' అని శాస్త్రవేత్తలకు ధైర్యం చెప్పారు.
ఉత్కంఠ..
చంద్రుని దిశగా చేసిన సుదీర్ఘ ప్రయాణంలో అత్యంత కీలకమైన దశ శనివారం తెల్లవారుజామున 1.43 గంటలకు ప్రారంభమైంది. బెంగళూరులోని ఇస్రో కార్యాలయం నుంచి శాస్త్రవేత్తలు పంపిన ఆదేశాలకు అనుగుణంగా అంతరిక్ష నౌకలోని విక్రమ్ ల్యాండర్ స్పందిం చడం ఆ క్షణం నుండే ప్రారంభమైంది. చంద్రుని వైపు ప్రయాణాన్ని అత్యంత సున్నితంగా పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన ఇస్ట్రాక్ (ఐఎస్‌టీఆర్‌ఏసీ) లోని శాస్త్రవేత్తల్లో తీవ్ర ఉత్కంఠ! సుదీర్ఘప్రయాణం అనంతరం ఇస్తున్న ఆదేశాలకు విక్రమ్ ఎలా స్పందిస్తుందో అన్న ఉద్వేగం అయితే, విక్రమ్ ఈ ఆదేశాలను అందుకుంది. చంద్రునివైపుగా
అడ్డంగా ప్రయాణం ప్రారంభించింది.7.4 కి.మీల తొలి దశ ప్రయణం సరిగ్గా 60 సెకన్లలో ముగిసింది. 1.53 గంటలకు తొలిదశ (రఫ్ బ్రేకింగ్) విజయవంతమైంది.
ఆగిన సంకేతాలు!
ఆ వెంటనే మరో 5 కిలో మీటర్ల ఫైన్ బ్రేకింగ్ దశ ప్రారంభమైంది. 53 సెకన్లలో ఈ దూరాన్ని విక్రమ్ అధిగమించాల్సిఉంది. ఆ తరువాత అత్యంత కీలకమైన నిట్టనిలువుగా చంద్రునిపైకి దిగే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే, ఇక్కడే.. ఆ 53 సెకన్లలోనే జరగరానిది ఏదో జరిగింది. ఆ సమయంలో చంద్రునిపైకి 300 మీటర్ల దూరంలో విక్రమ్ ఉంది! అప్పటి వరకు విక్రమ్ నుండి ఇస్ట్రాక్‌కు అందుతున్న సంకేతా లు నిలిచిపోయి. అంతే.. అంతా ఉత్కంఠ! ఏం జరుగుతుందోనన్న ఆందోళన! శాస్త్రవేత్తలు, ఇంజినీర్లతో పాటు దేశ ప్రజలంతా ఊపిరిబిగబెట్టి ఏం జరుగుతుందోనని ఎదురుచూసిన క్షణాలవి. సెకన్లు, నిమిషాలుగా గడిచిపోతున్నా విక్రమ్ నుంచి సంకేతాలు ఇస్ట్రాక్‌కు అందలేదు.
టెన్షన్..టెన్షన్..
మరికొద్ది సేపట్లో సక్సెస్‌ను అందుకుంటామనుకున్న శాస్త్రవేత్తలతో పాటు చంద్రయాన్.2 ఘనత కండ్లారా చూడాలనుకున్న అందరి ముఖాల్లోనూ అప్పటిదాకా ఉన్న చిరునవ్వు మాయమై టెన్షన్ వాతావరణం నెలకొన్నది. చివరగా ల్యాండర్ నుంచి శనివారం 1.36 నిమిషాలకు సంకేతాలు అందాయి. దాదాపు అరగంట వరకూ చూశాక..విషయాన్ని ప్రధాని మోడీకి ఇస్రో చైర్మెన్ వివరించారు. ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఉన్న మోడీ కొద్ది సేపు అక్కడ నుంచి నిష్క్రమించారు. మళ్లీ ప్రధాని వచ్చేలోపు.. ఇస్రో చైర్మెన్ కె.శివన్ మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్ల ల్యాండర్ నుంచి సంకేతాలు కోల్పోయామనీ, పరిస్థితులను విశ్లేషిస్తున్నామని ప్రకటించారు. చంద్రయాన్..2ను తిలకించటానికి వచ్చిన పిల్లలతో ప్రధాని మోడీ ముచ్చటించారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 'మీరు సాధించింది తక్కువేం కాదు. ధైర్యం కోల్పోవద్దు. యావత్ దేశం మొత్తం మీ వెంటే ఉంది. భవిష్యత్తుపై ఆశావాహా దృక్పథంతో ఉండండి' అని ధైర్యం
0 Response to "'విక్రమ్' నుంచి నిలిచిన సంకేతాలు"
Post a Comment