సౌర వ్యవస్థలో మరో కొత్త గ్రహం...!

* మానవ జీవనానికి అవకాశాలుంటాయంటున్న ఖగోళశాస్త్రవేత్తలు 




న్యూయార్క్‌: సౌర వ్యవస్థలో ఖగోళ శాస్త్రవేత్తలు మరో కొత్త గ్రహం జాడలను కనుగొన్నారు. ఇది దాదాపు భూమికి ఎనిమిది రెట్లు పరిమాణంలో వుందని, సౌర వ్యవస్థకు వెలుపల 111 కాంతి సంవత్సరాల దూరంలో వుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హబుల్‌ టెలిస్కోప్‌ సాయంతో రోదసిని గత కొన్నేళ్లుగా పరిశోధిస్తున్న శాస్త్రవేత్తలు తొలిసారిగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ గ్రహంపై మానవ జీవనానికి అనుకూల వాతావరణం కూడా వుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కె2-18బి అని పేరు పెట్టిన గ్రహం వైశాల్యం భూమి దాదాపు ఎనిమిది రెట్లు వుందని, ఇదంతా రాతి ప్రదేశంలా మందమైన ఉపరితలంతో, హైడ్రోజన్‌ పరిణామం ఎక్కువగా వున్న వాతావరణం వుందని నేచర్‌ ఆస్ట్రానమీ పత్రికలో ప్రచురించిన వ్యాసంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు

పూర్తి నీటితో మానవ జీవనానుకూల వాతావరణంతో వున్న గ్రహాన్ని తాము కనుగొనటం ఇదే తొలిసారి అని ఈ శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహిస్తున్న లండన్‌ యూనివర్శిటీ కళాశాలకు చెందిన ప్రొ.జియోవన్నా టినెట్టి చెబుతున్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సౌర వ్యవస్థలో మరో కొత్త గ్రహం...!"

Post a Comment