నెట్ బ్యాంకింగ్ ఖాతాదారులకు బ్యాంకు హెచ్చరిక

ముంబై : నెట్ బ్యాంకింగ్ ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల యూపిఐకి సంబంధించిన మోసాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ ఆన్‌లైన్ బ్యాంకింగ్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.




యూపీఐ యాప్‌లను ఉపయోగించి గూగుల్ పే, పేటీఎం,ఫోన్ పే వంటి యూపీఐ ఆధారిత చెల్లింపులు చేసే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఐసీఐసీఐ వెల్లడించింది. మీకు బ్యాంకు కస్టమర్ కేర్ పేరిట బోగస్ కాల్స్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు, బ్యాంకింగ్ వివరాలు అడిగితే అలాంటి కాల్స్ ను డిస్ కనెక్ట్ చేయాలని బ్యాంకు కోరింది. యూపీఐ ఖాతాను మీరు స్వయంగా సెటప్ చేసుకోవాలని, దీనికోసం వేరొకరి సహాయం తీసుకోవద్దని బ్యాంకు అధికారులు సూచించారు

మీకు వచ్చే ఓటీపీ లేదా పిన్, ఎస్ఎంఎస్ లను ఎప్పుడూ ఫార్వార్డ్ చేయవద్దని ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు హెచ్చరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నెట్ బ్యాంకింగ్ ఖాతాదారులకు బ్యాంకు హెచ్చరిక"

Post a Comment