గూగుల్‌పేలో ఇకపై క్రెడిట్ కార్డులు కూడా..!
ఇంటర్నెట్‌డెస్క్: ప్రముఖ సెర్చింజిన్ గూగుల్‌కు చెందిన పేమెంట్స్ యాప్ 'గూగుల్ పే' అందిరికీ సుపరిచితమే. అనతికాలంలో అతిపెద్ద పేమెంట్ ప్లాట్‌ఫాంగా ఇది అవతరించింది. ఈ నేపథ్యంలో గూగుల్ మరికొన్ని కొత్త సదుపాయాలను గూగుల్ పేలో తీసుకొస్తోంది. దిల్లీలో గురువారం నిర్వహించిన 'గూగుల్ ఫర్ ఇండియా' కార్యక్రమంలో వీటిని ప్రకటించింది. ఇందులో ఒకటి టోకెనైజ్డ్ కార్డ్స్ ఒకటి కాగా.. ఇంకోటి స్పాట్ ప్లాట్‌ఫాం.
టోకెనైజ్డ్ కార్డ్స్..
దేశంలో కోట్లాది మంది క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు జరిపేటప్పుడు వారంతా కార్డు వివరాలతో పాటు సీవీవీ, తదితర వివరాలను ఇస్తుంటారు
కొన్ని సందర్భాల్లో ఇలా చేయడం వల్ల ఆన్‌లైన్ మోసాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో గూగుల్ పే టోకెనైజ్డ్ కార్డ్స్ పేరిట కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా మన క్రెడిట్ లేదా/ డెబిట్ కార్డుకు సంబంధించిన అసలు వివరాలేవీ ఇవ్వకుండానే గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఇందుకోసం మన కార్డులను అందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు బ్యాంక్ ఖాతాల ఆధారిత పేమెంట్ సేవలు మాత్రమే గూగుల్‌పేలో అందుబాటులో ఉండగా.. ఇకపై కార్డులను కూడా వినియోగించుకునే వీలుంటుంది. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, కోటక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్స్‌కు చెందిన వీసా కార్డుదారులకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. త్వరలో మాస్టర్‌కార్డ్, రూపే కార్డులను కూడా అందుబాటులోకి గూగుల్ తేనుంది
స్పాట్‌ఫ్లాట్‌ఫాం..
ఇది ముఖ్యంగా విక్రేతలను దృష్టిలో పెట్టుకుని గూగుల్ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొన్ని వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం కోసం సైట్‌ను గానీ, యాప్‌ను గానీ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది. గూగుల్ పే స్పాట్ ఫ్లాట్‌ఫాం ద్వారా వ్యాపారులు అలాంటివేవీ క్రియేట్ చేయకుండానే గూగుల్‌పేలో నమోదు కావొచ్చు. దీనివల్ల తమ ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారం వినియోగదారులకు ప్రత్యక్షమవుతుంది. ఉదాహరణకు వినియోగదారుడు బస్ టికెట్‌ను గానీ, ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను గానీ వేరే యాప్‌లోకి వెళ్లకుండా నేరుగా ఆ 'స్పాట్' ఫీచర్‌ను ఉపయోగించి ఆర్డర్ చేయొచ్చు. పేమెంట్ కూడా అక్కడే పూర్తిచేయొచ్చు. ప్రస్తుతానికి మేక్‌మై ట్రిప్, ఈట్.ఫిట్, గో ఐబిబో, ఒవెన్ స్టోరీ, రెడ్‌బస్, అర్బన్ క్లాప్ విక్రేతలకు ఈ సదుపాయాన్ని గూగుల్ అందిస్తోంది. త్వరలో మరిన్ని కంపెనీలను 'స్పాట్' పరిధిలోకి తీసుకురానుంది. ఈ రెండు కొత్త ఫీచర్లను వినియోగించాలంటే గూగుల్ పే యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి
0 Response to "గూగుల్‌పేలో ఇకపై క్రెడిట్ కార్డులు కూడా..!"
Post a Comment