ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ మృతి
సికింద్రాబాద్ : ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ (40) బుధవారం కన్నుమూశారు. గత నెల రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వేణుమాధవ్.. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. వేణుమాధవ్ 1979 డిసెంబర్ 30 న జన్మించారు. వేణుమాధవ్ స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ. వేణుమాధవ్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. హైదరాబాద్ కు వచ్చిన కొత్తలో టిడిఎల్‌పి కార్యాలయంలో వేణుమాధవ్ పని చేశారు. కమెడియన్ గా వేణుమాధవ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1997 లో సంప్రదాయం చిత్రంతో వేణుమాధవ్ వెండితెరకు పరిచయమయ్యారు. తొలిప్రేమ తో వేణుమాధవ్ కు సినీ పరిశ్రమలో గుర్తింపు లభించింది
లక్ష్మీ సినిమాలో వేణుమాధవ్ నటనకు నంది అవార్డు దక్కింది. 600 చిత్రాలకు పైగా వేణుమాధవ్ నటించారు. పాత్రకు మిమిక్రీ జత చేసి నవ్వుల మసాలా దట్టించేవారు. ఒక దశలో వేణుమాధవ్ లేని సినిమా లేదు. హంగామా, భూకైలాష్, ప్రేమాభిషేకం వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. పోకిరీ, ఖతర్నాక్, దేశముదురు, కృష్ణ చిత్రాల్లో మంచి గుర్తింపు వచ్చింది. ప్రియమైన నీకు, ఆది, సొంతం, చిరుత, బ్లేడ్‌బాబ్జి, సై, ఛత్రపతి, దిల్, తమ్ముడు, సాంబ, సింహాద్రి, వెంకీ, అందాల రాముడు, మాస్, ఆయుధం, అడ్డా, ఆర్య, అడవి రాముడు, ఆంధ్రావాలా, బన్నీ, శంకర్‌దాదా, ఎంబిబిఎస్, సంక్రాంతి, అన్నవరం, జై చిరంజీవ వంటి తదితర సినిమాల్లో వేణుమాధవ్ నటించారు
0 Response to "ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ మృతి"
Post a Comment