డీఎస్సీ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్థుల జాబితా

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ జాబితాలో ఉన్న పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్లు, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ అభ్యర్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. వీటిని https://schooledu.ap.gov.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ కె.సంధ్యారాణి తెలిపారు. ప్రొవిజనల్‌ సెలక్షన్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో తమ 



సర్టిఫికెట్లను వెబ్‌సైట్లో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. సెప్టెంబర్‌ 23న పోస్టు గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ అభ్యర్థుల సర్టిఫికెట్లను, సెప్టెంబర్‌ 24, 25 తేదీల్లో ట్రయిన్డ్‌  గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ అభ్యర్థుల సర్టిఫికేట్లను వెరిఫికేషన్‌ చేస్తామని చెప్పారు. మొదటి ప్రోవిజినల్‌ సెలక్షన్‌ లిస్ట్‌ ప్రకారం ఉద్యోగ అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వివరించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డీఎస్సీ ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్థుల జాబితా"

Post a Comment