ఉద్యోగుల పీఆర్సీపై మాంద్యం ఎఫెక్ట్ : ఫిట్‌మెంట్ 25-30%..
తెలంగాణ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ 25-30%..!
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ సంఘం నివేదిక సిద్దం అయినట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్దిక మాంద్యం కారణంగా ఉద్యోగుల వేతన సవరణ విషయంలో ప్రభావం చూపుతోంది. దీంతో..10వ వేతన సవరణలో 43 శాతం మధ్యంతర భృతి ఇచ్చిన ప్రభుత్వం..ఇప్పుడు 25 నుండి 30 శాతం వరకు ఫిట్ మెంట్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. తెలుస్తోంది. ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వబోమని, నేరుగా పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తామని ఆర్థిక మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించడంతో పీఆర్సీపై ఉద్యోగులు, పింఛనుదారుల్లో మళ్లీ చర్చ మొదలైంది. సీఆర్ బిస్వాల్ అధ్యక్షతన వేతన సవరణ సంఘం(పీఆర్సీ) ఇప్పటికే తన నివేదికను పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది. త్వరలో ప్రభుత్వానికి అందించనుంది. రాష్ట్రంలోని 5.76 లక్షల ఉద్యోగులు, పింఛనుదారులకు 2018 సంవత్సరం జూలై 1 నుంచి కొత్త ఫిట్‌మెంట్ అమలు కావాల్సి ఉంది. దీనిని నిర్ధారించడానికి ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ముగ్గురు ఐఏఎ్‌సలతో 2018 మే నెలలో కమిటీని వేసింది. కమిషన్ రాష్ట్రంలోని వివిధ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘాలతో పలు దఫాలుగా
2
ఏడాది కాలంగా ఐఆర్ కోసం..
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఏడాది కాలంగా ఐఆర్ కోసం నిరీక్షిస్తున్నారు. గత ఎన్నికల సమయంలోనే దీనిని ప్రకటిస్తారని ఆశించారు. కానీ, ఆ ఊసే లేదు. ఫిట్‌మెంట్‌పై తేల్చడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున 2018 జూన్ 1 నుంచి ఐఆర్‌ను అమలు చేసే విషయాన్ని పరిశీలించింది. సీఎం సమక్షంలో సమావేశం జరిగినా తేలలేదు. సీఎం కేసీఆర్ 2018 స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ను ప్రకటిస్తామని వెల్లడించారు. అప్పటిలోగా పీఆర్సీ తన నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. అయినా... అప్పుడు ఫిట్‌మెంట్‌ను ప్రకటించలేదు. ఉద్యోగ సంఘాల నేతలు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలుస్తూ పీఆర్సీని అమలు చేయాలని కోరుతూ వచ్చారు
3
ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా
టీఎన్‌జీఓల సంఘం 63 శాతం మేర ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరింది. ఆర్థిక మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయంటూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. బడ్జెట్‌ను రూ.1.46 లక్షల కోట్లకు తగ్గించేశారు. దీని ప్రభావం పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై కూడా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చిన విషయం తెలంగాణ ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు వేతన సంఘ సిఫార్సులు మీద ఉద్యోగ సంఘాల నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు..ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి
0 Response to "ఉద్యోగుల పీఆర్సీపై మాంద్యం ఎఫెక్ట్ : ఫిట్‌మెంట్ 25-30%.."
Post a Comment