గ్రామ వలంటీర్ల విధులు.. బాధ్యతలు ఇవే.

అనంతపురం : ప్రస్తుతం ప్రభుత్వ శాఖల్లో వేడివేడిగా సాగుతున్న చర్చ గ్రామ వలంటీర్‌ పోస్టుల గురించే. నియామకాల ప్రక్రియ పూర్తి చేసి వారికి శిక్షణ ఇవ్వడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రధానంగా గ్రామ వలంటీర్లు గ్రామాల్లో చేయాల్సిన పనులతో పాటు వారి విధులు, బాధ్యతలను స్పష్టంగా వివరిస్తున్నారు.



విధులు

పీఆర్‌ఏ పద్ధతుల ద్వారా నిర్దేశించబడిన 50 ఇళ్ల ప్రజల పూర్తి సమాచారాన్ని నిర్దేశిత పట్టికలలో సేకరించాలి. బేస్‌లైన్‌ సర్వే ఆధారంగా వ్యక్తిగత, సామాజిక అవసరాలను గుర్తించి, తదనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. కేటాయించబడిన కుటుంబాలు పొందిన పథకాలు, ప్రయోజనాలు, ఆ ప్రాంతం సమగ్ర సమాచారాన్ని నిర్వహించాలి


పంచాయతీ ద్వారా కేరీర్‌ గైడెన్స్‌, కౌన్సిలింగ్‌, జీవన నైపుణ్యాలకు సంబంధించిన సేవలను ప్రజలకు అందిస్తూ వారు ఆనందదాయకమైన జీవితం గడిపేలా చూడాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి. అర్హులైన వారికి అందజేయవలసిన ప్రయోజనాలను అందిం చడంలో సహాయపడాలి.

రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి పారుదల సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిం చాలి. తాగునీరు , పారిశుధ్యం, పరిసరాల శుభ్రత, పరిశుభ్రత, ప్రాథమిక విద్యల ప్రాథమిక సమాచారాన్ని నిర్ణీత కాలంలో నవీకరించుకోవాలి. వివిధ ప్రభుత్వ సేవలను ఆయా కుటుం బాల ఇంటి ముంగిట అందేటట్లు చూడాలి. అవసరం మేరకు గ్రామ సచివాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శి నిర్వహించు సమావేశాలకు హాజ రు కావాలి. గ్రామ సచివాలయం కోరిన సమాచారమును అందిం చాలి. పంచాయతీ కార్యదర్శి ఆధీనంలో పనిచేయాలి.

బాధ్యతలు

ప్రజలు గుర్తించబడిన అవసరాల సమాచారాన్ని సేకరించి ఆయా శాఖల గ్రామస్థాయి అధికారులకు అందజేయాలి. ఫిర్యాదుల పరిష్కారానికి గ్రామ పంచాయతీ, వివిధ శాఖల తో సమన్వయం చేసుకుని లబ్ధిదారుల దరఖాస్తుల మేరకు ఆయా శాఖలు మంజూరు చేసిన అనుమతులను నిర్దేశించిన కాలపరిమితి లోపల వారికి అందజేయాలి. ఎప్పటికప్పుడు ఆయా కుటుంబాలను సందర్శిస్తూ, వారి తదు పరి అవ సరాలను గుర్తిస్తూ అప్పటివరకు ఆయా కుటుంబాలకు మంజూరైన పథకాల సక్రమ వినియోగంపై మా ర్గనిర్దేశం చేయాలి. కుల, మత, వర్గ, లింగ, రాజకీయ భేదాల కతీతంగా అర్హత కలిగిన వ్యక్తులకు ప్రభుత్వ పథకాలను చేరవేయాలి. గ్రామంలోనికి కొత్తగా ప్రవేశించిన వ్యక్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి గ్రామ పంచాయతీకి అందజేయాలి. విపత్తుల నిర్వహణ, ఆకస్మిక సంఘటనల నేపథ్యంలో నిర్దేశిత కుటుంబాలకు తగిన సహాయ సహకారాలు అందించాలి. సామాజిక దురాచారాలైన మద్యపాన నిషేధం, బాల్య వివాహాలు రూపుమాపటానికి తగిన సహాయ సహకారాలు అందించాలి.

విలువలు

నిజాయితీ: అప్పగించిన పనిని నిజాయితీగా నిర్వర్తించాలి. ప్రతి రోజూ కొంత సమయాన్ని ప్రజల కోసం కేటాయించాలి. ఎవరినో మెప్పించడానికి కాకుండా ఆత్మసంతృప్తి కోసం పనిచేస్తే శాశ్వత ఫలితాలు వస్తాయి.

పారదర్శకత: పనిచేసేటప్పుడు చేసే ప్రతి పని పారదర్శకంగా ఉండాలి. అన్ని విషయాలు అందరికీ తెలిసే విధంగా, అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ పనిచేయాలి. అలా పని చేసినప్పుడే అందరి మద్దతు లభిస్తుంది.

జవాబుదారీతనం: ప్రజలు అడిగే సమాచారం, సందేహాలకు ఓపికగా సమాధానం చెప్పాలి. ప్రజా సేవకులనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తగా పనిచేయాలి.

వినయశీలత: ప్రజల పట్ల గౌరవ, మర్యాదలు, వినయ విధేయతలతో నడుచుకోవాలి.

సమదృష్టి: మత, వర్గ, కుల, లింగ, రాజకీయ అ నుబంధాలకు అతీతంగా పనిచేయాలి. అందరినీ సమ భావంతో, సమదృష్టితో చూడాలి. సమానంగా సేవలు అందించాలి.

సంఘర్షణను నివారించుట: వలంటీర్‌ తన విధి నిర్వహణలో తనకు కేటాయించిన కుటుంబాలకు సేవలం దించేటప్పుడు వివిధ వర్గాల మధ్య ప్రయోజనాల కోసం తలెత్తే సంఘర్షణలను నివారించాలి. అత్యంత పేదవాడికి ప్రాధాన్యతనివ్వాలి. పథకం కింద వచ్చే లబ్దిదారులు ఎవ రనే విషయంపై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉండాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గ్రామ వలంటీర్ల విధులు.. బాధ్యతలు ఇవే."

Post a Comment