వాట్సాప్ పేరు మారింది.. ఇకపై బై ఫేస్‌బుక్‌గా
ఫేస్బుక్ మెసెంజర్, ఇన్‌స్టా, వాట్సాప్ యాప్‌లను అనుసంధానం చేయాలని జుకర్‌బర్గ్ నిర్ణయించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో ఆయా యాప్స్‌లో ఎలాంటి మార్పులూ జరగనప్పటికీ.. వీటిల్లో ఏ ఇతర ఖాతా లేకపోయినా మూడు సేవలనూ ఉపయోగించుకునే వీలు వుంటుంది.
కాగా, 2012లో ఇన్‌స్టాగ్రామ్‌ను, 2014లో వాట్సాప్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అవి అప్పటినుంచి ఆ పేర్లతోనే కొనసాగుతున్నాయి. అయితే ఇటీవలే పేరు మార్చాలని ఫేస్బుక్ నిర్ణయించింది. ఇకపై ఇన్స్టాగ్రామ్ బై ఫేస్బుక్, వాట్సాప్ బై ఫేస్బుక్ అని మారుస్తున్నట్లు వెల్లడించింది. అందుకనుగుణంగానే వాట్సాప్‌లో తాజా మార్పు చోటుచేసుకుంది. ఈ మార్పు వల్ల వాట్సాప్‌లో ఇప్పటికిప్పుడు వచ్చే మార్పు ఏదీ లేనప్పటికీ భవిష్యత్‌లో కీలక మార్పులకు ఫేస్బుక్ శ్రీకారం చుట్టనున్నట్లు
0 Response to "వాట్సాప్ పేరు మారింది.. ఇకపై బై ఫేస్‌బుక్‌గా"
Post a Comment