నిద్రలేమిని గుర్తించే నాసా పరీక్ష

వాషింగ్టన్‌: వివిధ రకాల కంటి కదలికల్ని గుర్తించడం ద్వారా నిద్రలేమి సమస్యను నిర్ధరించే పరీక్షను అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ..నాసా అభివృద్ధి పరిచింది. 




తేలికగా గుర్తించగల కంటి కదలికల్ని అంచనా వేయడం ద్వారా చిన్నపాటి నాడీసంబంధ లోపాల్నీ గుర్తించగల సునిశితమైన, విశ్వసనీయమైన ఉపకరణంలా ఈ పరీక్ష ప్రక్రియను 



ఉపయోగించవచ్చని నాసాకు చెందిన ఏమ్స్‌ పరిశోధక కేంద్రం పరిశోధనలో తేలింది. ఇవే అంచనాలను మద్యపానం, మెదడుకు గాయాల కారణంగా తలెత్తే నిద్ర సంబంధ లోపాల మధ్య తేడాల్ని గుర్తించవచ్చని కొంతమందిపై ప్రయోగశాలలో అధ్యయనం ద్వారా తేల్చారు.



 ఈ అధ్యయనంలో తేలిన అంశాల ద్వారా సైనికులు, సర్జన్లు, లారీడ్రైవర్లు వంటి వృత్తుల్లో ఉండేవారి విషయంలో బాగా ఉపయోగపడతాయని పరిశోధకులు పేర్కొన్నారు.



 తమ అధ్యయనంలో కేవలం నిద్రలేమి మాత్రమే కాకుండా, మద్యపానం, మెదడులో గాయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు పరిశోధకులు లీ స్టోన్‌ పేర్కొన్నారు


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నిద్రలేమిని గుర్తించే నాసా పరీక్ష"

Post a Comment