60 సెకన్లలో భగత్‌సింగ్ చిత్రం
కర్ణాటక: కేవలం 60 సెకన్లలోనే భగత్‌సింగ్ చిత్రాన్ని తలకిందులుగా గీసి మైసూర్‌లోని నదనహళ్లికి చెందిన పునీత్‌కుమార్ అందరినీ అబ్బుర పరుస్తున్నారు.
ఓ పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన స్నేహితుల సూచనల మేరకు తాను ఈ చిత్రం వేస్తుండగా
తీసిన వీడియోను ‘వరల్డ్ రికార్డ్స్ ఇండియా’ వెబ్‌సైట్‌కు పంపించగా సంబంధిత ప్రతినిధులు ఈ రికార్డును గుర్తించారు.
దీనిపట్ల పునీత్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిత్రాన్ని గీసేందుకు రోజూ సాధన చేసేవాడినని, మొదట్లో 130 సెకన్ల సమయం పట్టేదని తెలిపారు
0 Response to "60 సెకన్లలో భగత్‌సింగ్ చిత్రం"
Post a Comment