రైతులకు నేస్తం మేఘదూత్ యాప్

భారత వాతావరణ శాఖ, పూణెకి చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోఫికర్ మెటలార్జీ (ఐఐటీఎం) సంయుక్తంగా ఒక యాప్ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా రైతులకు వివిధ వాతావరణ సూచనలు చేస్తుంది




ఆయా ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు, పంటలు, పంటలకు సోకే వివిధ రకాల క్రిమికీటకాల గురించి తెలియచేస్తుంది

ఈ యాప్ పేరేంటో తెలుసా మేఘదూత్.మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, క్లైమేట్ రీసెర్చ్ అండ్ సర్వీస్ (సీఆర్ఎస్) సెంటర్ పూణె ఈ యాప్ నిర్వహిస్తున్నాయి. ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుని తమ వివరాలు పొందుపరిస్తే ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ అందుతాయి. పీడీఎఫ్ ఫార్మాట్లో వివరాలు వుంటాయి. రైతులు వాటిని చదువుకోవచ్చు.

అవసరమయిన వారికి షేర్ చేయవచ్చు. వాతావరణ నిపుణుల సలహాలు, పంటల వివరాలు తెలుసుకోవచ్చు.ఈ యాప్ ద్వారా 200 జిల్లాల్లో సేవలు అందుతాయి. త్వరలో 660 జిల్లాలకు విస్తరించనున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, డిస్ట్రిక్ట్ అగ్రోమెట్ యూనిట్ల ద్వారా, కేవీకెల ద్వారా సేవలు రైతులకు చేరనున్నాయి. త్వరలో స్థానిక భాషల్లో ఇతర ప్రాంతాల వారికి కూడా యాప్ అందుబాటులోకి రానుంది


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రైతులకు నేస్తం మేఘదూత్ యాప్"

Post a Comment