డిపాజిట్లు చేయాలనుకునే వారికి ఇదొక సువర్ణవకాశం

డిపాజిట్లు చేయాలనుకున్నవారు బ్యాంకులకు వెళ్ళకుండా ఒకసారి పోస్టాఫీస్ అందిస్తున్న నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్‌ను పరిశీలించండి. ఎందుకంటే ఈ స్కీమ్ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ పొందొచ్చు. ఎన్ఎస్‌సీ స్కీమ్ ప్రస్తుతం 7.9 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. 



వడ్డీ ఏడాది చొప్పున అకౌంట్‌కు జమవుతుంది. ఐదేళ్లపాటు డిపాజిట్ చేస్తే పన్ను ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం చేస్తే ఎన్‌ఎస్‌సీలో రూ.100 ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లలో అది రూ.146.25 అవుతుంది. అదే మీరు రూ.100 బదులురూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే ఇది 60 నెలల్లో రూ.14,824 అవుతుంది. 


రూ.10 వేలు కాకుండా రూ.1,00,000 ఎన్ఎస్‌సీలో పెట్టుబడి పెడితే అది ఐదేళ్లలో రూ.1,48,246గా మారుతుంది

పోస్టాఫీసుల్లో మీరు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన ఎన్ఎస్‌ఈల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఎన్‌ఎస్‌సీలో ఇన్వెస్ట్ చేయడమనేది అదిరిపోయే అవకాశంలాంటింది. 



వీటిల్లో పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టం 80సీ కింద ట్యాక్స్ రిబేట్ పొందొచ్చు. వార్షికంగా 1.5 లక్షల వరకు ఇన్వెస్ట్‌మెంట్లకు పన్ను మినహాయింపు లభిస్తుంది. మీరు రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఇది 5 ఏళ్లలో రూ.2.2 లక్షలు అవుతుంది. 




రాబడితోపాటు పన్ను ఆదా అవుతుంది. ఎన్‌ఎస్‌సీ స్కీమ్‌లో కనీసం రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డిపాజిట్లు చేయాలనుకునే వారికి ఇదొక సువర్ణవకాశం"

Post a Comment