ఉన్నత పాఠశాలల్లో ఎస్‌జీటీ పోస్టుల రద్దు

గుంటూరు, ఆగస్టు 20: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఉన్న 303 ఎస్‌జీటీ పోస్టులను రద్దు చేసి వాటిస్థానే పీఈటీ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 


వీరితో పాటు 2018 డీఎస్సీకి సంబంధించి క్లియర్ వేకెన్సీలో ఉన్న మరో 47 పీఈటీ పోస్టులను మంజూరు చేశారు. మొత్తం 350 పీఈటీ పోస్టుల భర్తీకి నిర్ణయించారు. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 46 పోస్టులు, చిత్తూరు జిల్లాలో 42 పోస్టులు పీఈటీ కింద భర్తీ కానున్నాయి. 




అలాగే శ్రీకాకుళం 31, విజయనగరం 12, విశాఖపట్నం 20, పశ్చిమ గోదావరి 11, కృష్ణ 13, గుంటూరు 24, ప్రకాశం 23, నెల్లూరు 12, కడప 18, కర్నూలు 32, అనంతపురం 19 చొప్పున పీఈటీ పోస్టులను కేటాయించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఉన్నత పాఠశాలల్లో ఎస్‌జీటీ పోస్టుల రద్దు"

Post a Comment