ఏపీలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు
అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సామాజిక వర్గాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. షెడ్యూల్డ్ కులాలైన మాల, మాదిగ, రెల్లి వర్గాల కోసం మూడు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ ఎస్సీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సమర్పించిన ప్రతిపాదనలు పరిశీలించిన అనంతరం మూడు వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. ఏపీ మాల వెల్ఫేర్ కార్పొరేషన్, ఏపీ మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్, ఏపీ రెల్లి వెల్ఫేర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఆదేశాల్లో స్పష్టం చేసింది
0 Response to "ఏపీలో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు"
Post a Comment