భారీగా తగ్గిన సిమెంట్ ధర... బస్తాకు ఎంత తగ్గిందో తెలిస్తే
- ఇసుక దెబ్బకు దిగివచ్చిన సిమెంట్ ధర
- బస్తాకు రూ.వంద తగ్గింపు
- అదే దారిలో ఇటుక
- దేశవ్యాప్తంగా తగ్గిన ఇనుము
మార్కెట్‌లో సిమెంట్ ధరలు తగ్గాయి. నాలుగు నెలల నుంచి రూ.350గా ఉన్న సిమెంట్ ధర గత వారం రోజులుగా తగ్గుతూ గురువారం నాటికి రూ.250కు వచ్చింది. అయితే దీనిని ఆనందించే స్థితిలో వినియోగదారుడు లేడు. సాధారణ పరిస్థితుల్లో అయితే రూ.వంద తగ్గితే గృహ నిర్మాణ యజమానులు, బిల్డర్లు ఎంతో ఆనందిస్తారు. అయితే ఇసుక కొరతతో అన్ని రకాల నిర్మాణాలు నిలిచిపోవటంతో రూ. వంద తగ్గినా సిమెంట్ వినియోగంలో మాత్రం పెద్ద మార్పు ఏమీ లేదు.
సాధారణ స్థితిలో జిల్లాలో రోజుకు సుమారుగా 66వేల బస్తాలు వినియోగం అవుతాయి. మొత్తం 22 కంపెనీలు జిల్లాలో సిమెంట్ మార్కెటిం గ్ చేస్తాయి. అయితే సిమెంట్ ధర తగ్గినా 20 నుంచి 25వేల బస్తాలు మాత్రమే మార్కెటింగ్ జరుగుతున్నట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇసుక సౌలభ్యం పెరిగి సాధారణ మార్కెట్ వస్తే మరలా సిమెంట్ ధరలు యథాస్థానానికి వెళతాయని మార్కెటింగ్ ప్రతినిధులు భావిస్తున్నారు.
ఇసుక ప్రభావం సిమెంట్ మీదే కాకుండా స్థానికంగా ఉండే ఇటుక పరిశ్రమ కూడా రేట్లు తగ్గించింది. స్టాక్‌లు పేరుకుపోవడం, కొత్త మట్టిని నిల్వ ఉంచుకునే అవకాశం లేకపోవడంతో తయారీ దారులు ధర తగ్గించి అమ్ముకుంటున్నారు. గతంలో రూ.7గా ఉన్న ఒక ఇటుక ధర ప్రస్తుతం రూ.5కు వచ్చింది. అయినా మార్కెటింగ్ లేదు. కొందరు బిల్డర్లు మాత్రం అప్పు ప్రాతిపదికన ఇటుకను దిగుమతి చేసుకొని
నిల్వ ఉంచుకుంటున్నారు. అయితే ఇటుక పరిశ్రమ యజమానులు స్థలా భావం వలన తరలిస్తున్నారు.
జాతీయ మార్కెట్‌లో తగ్గిన ఇనుము
స్థానికంగా ఇసుక కొరత కారణంగా మన రాష్ట్రంలో సిమెంట్, ఇటుక ధరలు తగ్గితే ఇనుము మార్కెట్ మాత్రం దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది. దాదాపు టన్నుకు రూ.5 వేల నుంచి 7 వేల వరకు తగ్గింది. అయితే ఇది ఇసుక ప్రభావం కాదని, జాతీయ మార్కెట్‌లో వచ్చిన ఒడిదుడుకులు కారణంగా ధరలు తగ్గినట్లు వ్యాపారులు
0 Response to "భారీగా తగ్గిన సిమెంట్ ధర... బస్తాకు ఎంత తగ్గిందో తెలిస్తే"
Post a Comment