ఎస్‌బిఐ కార్డు మొబైల్ యాప్‌లో ఐఎల్‌ఎ
హైదరాబాద్ : ఎస్‌బిఐ కార్డ్ సంస్థ తన మొబైల్ యాప్‌లోకి చాట్‌బాట్ ఐఎల్‌ఎ (ఇంటరాక్టివ్ లైవ్ అసిస్టెంట్)ను ప్రవేశపెట్టినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఖాతాదారులకు మరింత సౌలభ్యాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో దీన్ని ఆవిష్కరించినట్లు ఎస్‌బిఐ కార్డు ఎండి, సిఇఒ హర్దాయల్ ప్రసాద్ పేర్కొన్నారు.
40కు పైగా వినూత్నమైన స్వయం సేవ ఫీచర్లతో ఉన్న ఐఎల్‌ఎను ఆఫర్ చేస్తున్న తొలి సంస్థ తమదేనన్నారు. ఇఎంఐ కన్వర్షన్, బ్యాలన్స్ బదిలీ, క్రెడిట్ కార్డుపై రుణం, ఇతర అకౌంట్ నిర్వహణ ఆప్షన్లను ఇందులో పొందుపర్చామన్నారు. పరిశ్రమలోనే మొబైల్ చాట్‌బాట్ ద్వారా ఆఫర్ చేస్తుండడం ఇదే తొలిసారి అన్నారు.
SBI Card in Mobile App, ILA
0 Response to "ఎస్‌బిఐ కార్డు మొబైల్ యాప్‌లో ఐఎల్‌ఎ"
Post a Comment