డి.ఎ గురించి విశ్లేషణాత్మక వివరణ

జనవరి 2019 మరియు జులై 2019 నుంచి మంజూరు కావాల్సిన రెండు విడతల DA లు ఎంతెంత పర్సెంట్ ఉండనున్నాయో తెలుసుకోవాలనే కుతూహలం చాలామంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఉంటుంది. కొందరు మిత్రులు దీనిపై ఓ పోస్టింగ్ పెట్టమని అడిగారు. 


        కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఫస్ట్ జనవరి 2019 నాటి DA ను ఎప్పుడో చెల్లించారు. ఫస్ట్ జులై 2019 నుంచి చెల్లించాల్సిన DA వాయిదా ఎంత పర్సెంటో మొన్న సెంట్రల్ లేబర్ బ్యూరో విడుదల చేసిన All India Consumer Price Index for Industrial Workers (AICPI WI) తో తేలిపోయింది. ఐదు శాతం (7th CPC) ఉంటుందని స్పష్టమైంది. పెరిగిన ఈ DA ను కేంద్రం సెప్టెంబర్ లోగా మంజూరు చేస్తుంది. 6th CPC ఫార్ములా ప్రకారం మన DA 



లెక్కిస్తారనే విషయం తెల్సిందే! దీని ప్రకారం...  ఫస్ట్ జనవరి 2019 నుంచి 3.144% Additional DA, ఫస్ట్ జులై 2019 నుంచి 5.24% అదనపు DAను రాష్ట్ర ప్రభుత్వోద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 

లభించనుంది. అంటే, కేవలం DAల రూపంలోనే మూలవేతనంపై 8.384 శాతం అదనపు మొత్తం దక్కాల్సి ఉంది. RPS-2015 పే స్కేళ్లనే పొందుతున్న AP ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సైతం ఈ DA పర్సెంటేజ్లే లభిస్తాయి. 
✍ఎం.ప్రతాపరెడ్డి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డి.ఎ గురించి విశ్లేషణాత్మక వివరణ "

Post a Comment