ఇస్రో ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీలు
10న ఆన్‌లైన్‌లో దేశవ్యాప్తంగా నిర్వహణ
శ్రీహరికోట(సూళ్లూరుపేట), ఆగస్టు 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విద్యార్థులకు అంతరిక్ష కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఎంవైజీవోవి డాట్ ఐఎన్ సమన్వయంతో ఈ నెల 10న ఆన్‌లైన్ క్విజ్ పోటీలు నిర్వహించనుంది.
దేశవ్యాప్తంగా 8-10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులని ఇస్రో అధికారులు శనివారం తెలిపారు. క్విజ్‌లో పాల్గొనేవారు ఎంవైజీవోవి డాట్ ఐఎన్ వెబ్‌సైట్‌లో ముందుగా వ్యక్తిగత ఖాతాను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది.
ఈ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత ధ్రువీకరణ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. క్విజ్ వ్యవధి 5 నిమిషాల్లో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి.
ప్రతి రాష్ట్రం, ప్రతి కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఇద్దరేసి చొప్పున విజేతలను ఎంపిక చేయనున్నారు. వారిని బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రానికి ఆహ్వానించి,
సెప్టెంబరు 7న జాబిల్లిపై దిగే ల్యాండర్‌ను ప్రధాని మోదీతో కలసి వీక్షించే అవకాశం కల్పించనున్నారు. కాగా, చంద్రయాన్-2 మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో.. చందమామ గురించి చిన్ననాటి
CLICK HERE TO OFFICIAL WEBSITE
స్మృతులను తమతో పంచుకోవాలని ప్రజలను ఆహ్వానించింది. వాటిలో అత్యంత అద్భుతమైన కథలను తమ సోషల్ మీడియా సైట్‌లలో ఉంచుతామని ట్వీట్ చేసింది
Additional information
జాబిలిపై ల్యాండర్ దిగడాన్ని మోదీతో కలిసి వీక్షించే అవకాశం
విద్యార్థులకు అంతరిక్ష కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 10న ఆన్‌లైన్‌లో ఓ క్విజ్ పోటీని నిర్వహస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించిందని ఆంధ్రజ్యోతి వార్త ప్రచురించింది.
దేశవ్యాప్తంగా 8-10 తరగతుల విద్యార్థులు ఇందులో పాల్గొనేందుకు అర్హులని ఇస్రో తెలిపింది. క్విజ్‌లో పాల్గొనాలనుకునేవారు క్విజ్.ఎంవైజీవోవి.ఇన్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
5 నిమిషాల వ్యవధిలో 20 ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సి ఉంటుందని, దీనికి భారత దేశ విద్యార్థులు మాత్రమే అర్హులని ఇస్రో తెలిపింది. తక్కువ సమయంలో సరైన సమాధానాలిచ్చిన విద్యార్థులను విజేతలుగా ప్రకటిస్తారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఇద్దరేసి విద్యార్థులను విజేతలుగా ఎంపికచేస్తారు
వీరిని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కేంద్రానికి ఆహ్వానించి సెప్టెంబర్ 7న జాబిలిపై ల్యాండర్ దిగే దృశ్యాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి వీక్షించే అవకాశం కల్పిస్తారు
0 Response to "ఇస్రో ఆన్‌లైన్‌లో క్విజ్ పోటీలు"
Post a Comment