ఇక నుంచి వాట్సాప్‌లో ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్‌ ఫీచర్‌

దిల్లీ: మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ నిత్యం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. అయితే నకిలీ వార్తలను కట్టడి చేయడం కోసం గత ఏడాది తీసుకువచ్చిన ‘ఫార్వర్డ్’ ఫీచర్‌లో మరిన్ని మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 



దానిలో భాగంగా ఇప్పుడు మెసేజ్‌లు ఫార్వర్డ్‌ చేయడాన్ని మరింత నియంత్రించేందుకు త్వరలో ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్  మెసేజ్‌ ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. దీంతో ఎక్కువ సంఖ్యలో మెసేజ్‌లను పంపే యూజర్లు వాటిపై ఆలోచించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. 



అలాగే ఫార్వర్డ్‌  స్థానంలో ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్‌ లేబుల్‌ కనిపించనుంది. దాంతో పాటు ఒకే మెసేజ్‌ను అప్పటికే చాలాసార్లు ఫార్వర్డ్‌ చేసి, మళ్లీ చేయాలనుకున్న ప్రతిసారి వాట్సాప్‌ ఓ నోటిఫికేషన్‌ను చూపిస్తుంది. దాంతో పాటు బూడిద రంగులో డబుల్‌ యారో కనిపిస్తుంది. కంపెనీ వర్గాలు వెల్లడించిన ప్రకారం..‘ఇప్పటికే చాలాసార్లు ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేశారని గుర్తించేలా ఓ మెసేజ్‌ను చూపిస్తుంది’ అని తెలిపాయి. 


అయితే ఎన్నిసార్లు దాన్ని పంపారో ఆ సంఖ్యను మాత్రం చూపించదని వివరించాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇక నుంచి వాట్సాప్‌లో ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్‌ ఫీచర్‌"

Post a Comment