ఐటి రిటర్న్సు దాఖలు తప్పనిసరి

ఉద్యోగులకు ఐటి రిట ర్న్సు దాఖలు పై శిక్షణ 
- ఇన్‌కం ట్యాక్స్‌ ఆధ్వర్యంలోహెల్ప్‌డెస్కు ప్రారంభం 
- సమావేశంలో జిఎడి ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా 
ప్రజాశక్తి-అమరావతిబ్యూరో 
కుటుంబ సంక్షేమం కోసం ఐటి రిటర్న్సు దాఖలు చేయటం తప్పనిసరని జిఎడి ముఖ్యకార్యదర్శి ఆర్పి సిసోడియా పేర్కొన్నారు. సచివాలయంలో కర్ధాత ఇ సహ్యోగ్‌ అభియాన ఆధ్వర్యంలో ఇన్‌ కమ్‌ ట్యాక్స్‌ ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్కును ఆయన శుక్రవారం ప్రారంభించి ఉద్యోగులకు అవగాహన కల్పించారు




ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్రతి శాఖలోనూ సరళీకృత విధానాలను అమలు చేస్తున్నారని, ఆ దిశలోనే ఆదాయ పన్ను శాఖ రిటర్న్సులను స్వీకరించటంలో ఆన్‌లైన్‌ విధానాలను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. 


ఆదాయ పన్ను పరిమితికి లోబడి ఎటువంటి పన్ను పడకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్థిష్ట కాలపరిమితిలో ఐటి రిటర్న్సు దాఖలు చేయాలని అన్నారు. ఉద్యోగులకు కనీస పరిజ్ఞానం పెంపొందించటంలో ఐటి శాఖ కృషిని 


అభినందిస్తున్నామని, ప్రజలందరికీ ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రావటం సంతోషంగా ఉందన్నారు. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ శాఖ ప్రిన్సిపల్‌ కమిషనర్‌ ఎం.భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పిల్లల చదువులు, ఆరోగ్యం, విదేశీయానం, బ్యాంకుల నుంచి రుణాలు పొందే సందర్భాల్లో మూడేళ్లనుంచి ఐటి రిటర్న్సు కోరుతున్నారని, ప్రతి దానికి ఇన్‌కమ్‌ ట్యాక్సు అనుబంధంగా ఉందని గుర్తుంచుకోవాలన్నారు. 



శిక్షణా కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పిస్తూ కార్యాలయ అధిపతులు వారి పరిధిలో పనిచేసే సిబ్బంది జీత భత్యాల వివరాలను ఎప్పటికప్పుడు ఐటి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని, దాని ఆధారంగా ఆన్‌లైన్‌లో ఉత్పన్నమయ్యే ఫారమ్‌ -16కు గుర్తింపు వస్తుందని వివరించారు. కొద్దిపాటి అవగాహన పెంచుకుంటే పాన్‌ కార్డు ఆధారంగా, మొబైల్‌ నంబర్‌ ఆధార్‌ సంఖ్యకు అనుసంధానం చేయటం ద్వారా సులభంగా రిటర్నులను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించుకోవచ్చని తెలిపారు.



 ఈ సేవలను సచివాలయ ఉద్యోగులకు ఐదో బ్లాకులోని హెల్ప్‌డెస్కులో సోమవారం నుంచి శుక్రవారం వరకు అందుబాటులో ఉంచుతామని, అవసరమైతే మరో వారం పొడిగిస్తామని తెలిపారు. ఈ సరదర్భంగా ఉద్యోగులకు వచ్చిన పలు సందేహాలు నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ జె.సంధ్యారాణి, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్వేత, ఇన్‌కమ్‌ ట్యాక్సు అధికారి సెల్వన్‌రాజ్‌, సచివాలయ ఉద్యోగులు, సిఎ విద్యార్థులు పాల్గొన్నారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఐటి రిటర్న్సు దాఖలు తప్పనిసరి"

Post a Comment