ఆనందవేదిక

*🌳 ఆనందవేదిక 🌳*

ఏకాగ్రత సాధనకు స్వాగతం

తేదీ: 5.8.2019
 5వ సోమవారం
1వ లెవెల్ -2వ లెవెల్- 3వ లెవెల్(1 నుండి 8 తరగతులకు)
ఆనందవేదిక లో...ఏకాగ్రత సాధన కథలు కృత్యాలు భావ వ్యక్తీకరణలు 4 వ వారం పూర్తి చేసుకొని కృతకృత్యులైనాము.
నిన్న జరిగిన మనటివి   టెలి కాన్ఫరెన్స్ లో..చాలా సందేహాలు తొలగించుకున్నాము  మనపాఠశాల ల్లో...అన్ని తరగతులకు చక్కగా.. అమలు పరుస్తున్నాం అనుభవపూర్వకంగా...మనం తెలుసుకుంటున్నాం!
విద్యార్థుల ఉత్సాహాన్ని కనులారా..చూస్తున్నాం.
ఇదే ఉత్సాహం తో... ఉపాధ్యాయులంతా కలిసి నడిస్తే.. భావితరానికి నవ నిర్మాతలమందించే వాళ్ళమవుతాం.
అందుకు కావలసిన మార్గనిర్దేశం మరింత పటిష్టంగా ఉపాధ్యాయులమంతా... కలిసి ఆనంద వేదికను ఆటలంత ఆనందంగా పాటలంత ఆహ్లాదంగా విద్యార్థులకు అందిద్దాం!


ఇక 5వ వారం ఆనంద వేదికలో..
*****************************
..ప్రతీ సోమవారం 1-2-3 లెవెల్స్  (1నుండి 8 తరగతులు) కి శ్వాస పై ధ్యాస అనే "ధ్యానప్రక్రియను " చేయించాలి.

సమయం: 30 నిమిషాలు

ఉద్దేశ్యం: వినడం పట్ల ఏకాగ్రత.

శ్వాస మీద ద్యాస: 3 నిమిషాలు.

(క్రమ నియమాన్ని పాటించాలి.)

* విద్యార్థులను ప్రశాంతంగా...కళ్ళు మూసుకొని కూర్చోమనాలి..
* కొన్ని సాధారణమైన శ్వాసలు తీసుకోమనాలి.
* వాటిని కొనసాగించమనాలి.
* కొన్ని దీర్ఘమైన శ్వాసలు తీసుకోమనాలి.
* వాటిని కొనసాగించమనాలి.
* తిరిగి సాధారణమైన శ్వాసకు రమ్మనాలి.
* ఇప్పుడు నెమ్మదిగా పరిసరాలు గమనిస్తూ...కళ్ళు తెరవమానాలి.



కార్యాచరణ సోపానాలు: 25 నిమిషాలు:
***********************************
* విద్యార్థులను కాసేపు గెంతమనాలి.
* అలసట వచ్చాక గుండె పై చేయి ఉంచి వారి హృదయస్పందనను వినమనాలి.

తదుపరి విద్యార్థుల స్థాయిని బట్టి లెవెల్స్ వారీ...కరపత్రంలో...ఇచ్చిన విధంగా..
కొన్ని ప్రశ్నలు వేయాలి





మౌన ప్రక్రియ: 2 నిమిషాలపాటు కళ్ళు మూసుకొని విద్యార్థులను కూర్చోమనాలి.ఇంటి దగ్గర కుటుంబసభ్యులతో  స్నేహితులతో..
కలిసిఈ అభ్యసన చేయమనాలి.

ధన్యవాదాలతో...
Dr. మురహరరావు.ఉమాగాంధి
(SRP)
ఆనందవేదిక

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆనందవేదిక"

Post a Comment