415 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌

యూపీఎస్సీలో పలు పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 415పోస్టుల్లో నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ(ఎన్డీయే)లో 370, నేవల్‌ అకాడమీ(ఎన్‌యే)లో 45 పోస్టులు 




భర్తీ చేస్తామని యూపీఎస్సీ పేర్కొంది. ఎన్డీయే ఖాళీలను చూస్తే.. సైన్యంలో 208, నేవీలో 42, వాయుసేనలో 120 ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చే నెల 3లోపు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. మరిన్ని వివరాలకు upsc.gov.in/ వెబ్‌సైట్‌ లో 



చూడవచ్చని పేర్కొంది. నవంబరు 17న నిర్వహించే ఈ పరీక్ష దరఖాస్తు ఫీజు జనరల్‌ కేటగిరీకి రూ.100.. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఉచితం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "415 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌"

Post a Comment