డిసెంబర్ కల్లా వాట్సాప్ చెల్లింపు సేవలు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ముగింపు నాటికి ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన చెల్లింపు సేవలను అందుబాటులోకి తేనున్నామని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ కాత్‌కార్ట్ వెల్లడించారు. డిసెంబర్ కల్లా పేమెంట్ సేవలను ప్రారంభించనున్నామన్నారు. దీనికి సంబంధించి అనుమతులు వచ్చాక దేశంలోని
వినియోగదారులందరిని భాగస్వాములను చేస్తామన్నారు. ప్రస్తుతం వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది.. భారత్‌లో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. తమ మెసేజింగ్ సేవల మాదిరిగానే సులభంగా డబ్బును ఇతరులకు
పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విల్ తెలిపారు. వాట్సాప్ చెల్లింపు సేవలు ఆర్‌బిఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు నేపథ్యంలో వాట్సాప్ పలు అనుమతుల కోసం ఎదురు చూస్తోంది.
0 Response to "డిసెంబర్ కల్లా వాట్సాప్ చెల్లింపు సేవలు"
Post a Comment