ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష షెడ్యూల్ విడుదల
ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష షెడ్యూల్ విడుదల
ఈనాడు, దిల్లీ: టెన్త్ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు నిర్వహించే నేషనల్ టాలెంట్ సెర్చి ఎగ్జామినేషన్
(ఎన్‌టీఎస్‌ఈ) షెడ్యూల్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రెండు దశల్లో జరిగే ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2వేల మంది విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,250 నుంచి రూ.2వేల వరకు ఉపకారవేతనం ఇస్తారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తొలి దశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబరు 3 వరకూ గడువు ఉంది. జాతీయస్థాయిలో జరిగే రెండోదశ పరీక్షకు 2020 మే 10వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన పాఠశాలల్లో 10వ తరగతి చదివే
విద్యార్థులంతా తొలి దశ పరీక్ష రాయడానికి అర్హులే. ఓపెన్, డిస్టెన్స్ పద్ధతిలో టెన్త్ చదువుతున్న 18 ఏళ్లలోపు వారూ అర్హులే
0 Response to "ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష షెడ్యూల్ విడుదల"
Post a Comment