*గురువుకో గుర్తింపుకార్డు.. విద్యాశాఖ
*గురువుకో గుర్తింపుకార్డు.. విద్యాశాఖ
📚📚📚📚📚📚📚📚
మరో రెండు నెలల్లో అందజేత
ఒక్కో ఐడీ కార్డుపై రూ.50 వ్యయం
కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అనంతపురం విద్య : గురువులకు ఒక గుర్తింపు కార్డు అందనుంది. రాష్ట్ర విద్యాశాఖ చరిత్రలోనే తొలిసారి ఉపాధ్యాయులకు ఐడీ కార్డు ఇవ్వనున్నారు. ఇటీవల పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా కూడా ఊపినట్లు తెలుస్తోంది. త్వరలో నిధులు కూడా విడుదల కానున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే....మరో రెండు నెలల్లో గురువులకు ఓ గుర్తింపు కార్డు అందజేయనున్నారు. ఇతర
ప్రభుత్వశాఖలతో పోలిస్తే విద్యాశాఖ విస్తృతమయినది. పాఠశాల అంటే ఠక్కున గుర్తొచ్చేది గురువులే. అలాంటి గురువులకు ఇప్పటివరకూ గుర్తింపు కార్డు లేదు. దీంతో కేంద్రప్రభుత్వం వారికి గుర్తింపు కార్డు ఇవ్వాలని యోచిస్తోంది. అందులోభాగంగా నిధుల కేటాయింపునకు పచ్చజెం డా ఊపింది. ఒక్కో గుర్తింపుకార్డుకు రూ. 50 చొప్పు న వ్యయం చేయనున్నారు. మరో రెండు నెలల్లో..
ఉపాధ్యాయులకు తొలిసారిగా ఐడీ కార్డులు ఇవ్వనున్నారు. ఇప్పటికే కేంద్రం నుంచి దీనికి సంబంధించి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కేంద్రం నిధుల విడుదల చేయడంతో...రాష్ట్ర విద్యాశాఖ నేరుగా రాష్ట్రస్థాయిలోకానీ, జిల్లాలకు వీటిని తయారు చేసేబాధ్యతలను ఇచ్చే అవకాశం ఉంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ ఆఖరిలోపు గుర్తింపు కార్డులను అందజేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గుర్తింపు కార్డులు రానుండటంపై ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
0 Response to "*గురువుకో గుర్తింపుకార్డు.. విద్యాశాఖ"
Post a Comment