చిన్నపేగు వ్యాధులకు సరికొత్త చికిత్స
హైదరాబాద్ సిటీ, జూలై 19 (ఆంధ్రజ్యోతి): చిన్న పేగుకు ఏదైనా సమస్య వస్తే గుర్తించడం కష్టం. వ్యాధి ముదిరేంత వరకు నిర్ధారించలేని పరిస్థితి. ఇప్పటివరకు సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ యంత్రాలతో పరీక్షలు చేస్తున్నారు. ఇది కూడా కొంత భాగం వరకే సమస్యను గుర్తించే అవకాశం ఉంది. వ్యాధి నిర్ధారణ తరువాత చికిత్స కూడా కష్టంతో కూడుకున్నదే. ఈ సంక్లిష్టతకు ఆధునిక వైద్య విధానం 'పవర్ స్పైరల్ ఎంట్రోస్కోపీ' తెరదించుతోంది
చిన్నపేగులో ఏ భాగంలో సమస్య వచ్చినా నిర్ధారించి, శస్త్రచికిత్స అవసరం లేకుండా ఈ పరికరంతోనే వైద్యం అందించవచ్చునని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ) డైరెక్టర్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ''పవర్ స్పైరల్ ఎంట్రోస్కో్‌పను ప్రత్యేక మోటారు ద్వారా నడుపుతారు. ఇది చిన్నపేగుల్లో మొత్తం 22 అడుగుల వరకు దృశ్యాలను చిత్రీకరించి, జబ్బును నిర్ధారిస్తుంది'' అని వివరించారు. దీని ద్వారా చిన్నపేగుల్లో కేన్సర్, రక్తస్రావం, కణుతులను గుర్తించి, చికిత్స చేయవచ్చునని చెప్పారు. పాత విధానంలో చిన్నపేగు వ్యాధులకు సర్జరీకి రూ.2 లక్షల వరకు ఖర్చయితే, ఇప్పుడు రూ.40 వేలకే పూర్తవుతుందని చెప్పారు. ఈ సౌకర్యాన్ని ఆసియాలో తొలిసారిగా ఏఐజీలోనే అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా ఇప్పటివరకు 10 మందికి చికిత్స అందించామని తెలిపారు
0 Response to "చిన్నపేగు వ్యాధులకు సరికొత్త చికిత్స"
Post a Comment