నేడు మంత్రి వర్గం భేటి
- పలు చట్టాలకు సవరణ
- ముసాయిదా ప్రతిపాదనలకు ఆమోదం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
చట్టాల సవరణలపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ అధ్యతక్షన మంత్రిమండలి సమావేశం జరగనుంది. దీనిలో చట్ట సవరణలకు సంబంధించి పలు బిల్లులను చర్చించి ఆమోదం తెలపనున్నారు.
- ముసాయిదా ప్రతిపాదనలకు ఆమోదం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
చట్టాల సవరణలపై గురువారం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. గురువారం ఉదయం ముఖ్యమంత్రి జగన్ అధ్యతక్షన మంత్రిమండలి సమావేశం జరగనుంది. దీనిలో చట్ట సవరణలకు సంబంధించి పలు బిల్లులను చర్చించి ఆమోదం తెలపనున్నారు.
ఈ అసెంబ్లీలో పెట్టునున్న బిల్లుల్లో లోకాయుక్త నియామక అంశం కీలకంగా ఉంది. తెలంగాణా ప్రభుత్వం లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించుకనేలా చట్ట సవరణ చేసింది.
ఇదే పద్ధతిని రాష్ట్రంలోనూ అమలు చేయనున్నారు. జ్యుడీషియల్ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ యాక్డు-2001ను సవరిస్తూ బిల్లును తీసుకురానున్నారు
జ్యుడీషియల్ కమిషన్ కోసం ఒక చట్టాన్ని తీసుకురానున్నారు. పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు సంబంధించి ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చే బిల్లుకూ, వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పలు సంస్కరణలూ తీసుకురానున్నారు. జిల్లా ఆస్పత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించేలా సొసైటీలు, ట్రస్టుల కిందకు తీసుకొచ్చేందుకు అవసరమైన చట్ట సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలపనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్, పాలక మండలి సభ్యులను ఎప్పుడైనా రీకాల్ చేసేందుకు వీలుగా చట్టాన్ని తీసుకొస్తోంది. రెవెన్యూ, కార్మికశాఖలకు చెందిన రెండు చట్ట సవరణ బిల్లులనూ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వాటికి అనుమతి తెలపనున్నారు
0 Response to "నేడు మంత్రి వర్గం భేటి"
Post a Comment