ఆ రెండు పథకాలకు జగన్‌ పేరు

అమరావతి: ప్రభుత్వాలు మారిన తర్వాత పథకాలు పేర్లు మారడం సహజం. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ పేర్లతో పలు పథకాలు అమల్లో ఉండేవి. ఏపీలో ఆ తర్వాత వచ్చిన తెదేపా ప్రభుత్వం వాటి పేర్లను మార్చింది. కొన్ని కొత్త పథకాలను ప్రకటించి.. వాటికి ఎన్టీఆర్‌, చంద్రన్న వంటి పేర్లు పెట్టింది. తాజాగా ఎన్నికైన వైకాపా ప్రభుత్వం సైతం అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పథకాల పేర్లను వైఎస్‌ పేరు వచ్చే విధంగా మార్చింది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, వైఎస్‌ఆర్‌ బీమా, వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణాలు వంటివి అందులో ఉన్నాయి. చాలా వరకు పథకాలకు తన తండ్రి పేర్లనే పెట్టారు ముఖ్యమంత్రి 

అయితే, జగన్‌ పేరుమీదా రెండు పథకాలకు పేర్లు ఉన్నాయి. అవి ఒకటి జగనన్న అమ్మఒడి కాగా.. ఇంకోటి జగనన్న విద్యా దీవెన పథకం. బడ్జెట్‌లో ఈ రెండు పథకాల పేర్లు ప్రస్తావనకు వచ్చింది.

ఈ పథకాలకు జగన్‌ పేరు పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా బుగ్గన వివరించారు. బడికి పంపే పిల్లల తల్లికి 




రూ.15వేలు అందించేందుకు ఉద్దేశించిన 'అమ్మ ఒడి' జగన్‌ రూపకల్పన చేశారు కాబట్టే ఆయన పేరు పెట్టేందుకు తాము ప్రతిపాదించామని బుగ్గన వివరించారు. తొలుత ఆయన నిరాకరించినప్పటికీ తమ ఒత్తిడితో ఆయన అంగీకరించారని తెలిపారు. దీంతో పాటు ఉన్నత విద్యకు సంబంధించి నూరుశాతం ఫీజు 


రీయింబర్స్‌మెంట్‌ అందించే జగనన్న విద్యాదీవెన పథకానికీ జగన్‌ పేరు పెట్టడం గమనార్హం. ఈ పథకం కింద ఆహారం, ప్రయాణం, హాస్టల్‌, పుస్తకాలు మొదలైన ఖర్చులను భరిచేందుకు రూ.20వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తుంది. ఇందు కోసం ప్రభుత్వం రూ.4,962.3 కోట్లు కేటాయించగా.. అమ్మ ఒడి పథకానికి రూ.6,455 కోట్లను కేటాయించింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఆ రెండు పథకాలకు జగన్‌ పేరు"

Post a Comment