చంద్రయాన్ 2 ప్రయోగాన్ని విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం
అమరావతి: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ 2 ప్రయోగాన్ని విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని డిజిటల్ తరగతులు, వర్చువల్ తరగతులు, టీవీ, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా విద్యార్థులు చంద్రయాన్ 2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేలా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలివ్వాలని సూచించారు. రేపు మధ్యాహ్నం 2 నుంచి 2.30 గంటల వరకు చంద్రయాన్ 2 విశేషాలతో పాటు దాని ప్రాముఖ్యతను విద్యార్థులు తెలియజేయాలని మంత్రి ఆదేశించారు
చంద్రయాన్-2
చంద్ర మండలాన్ని శోధించటానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO), రష్యన్ అంతరిక్ష సంస్థ (RKA)ల యొక్క సంయుక్త కార్యక్రమం. ఈ కార్యక్రమం ఖర్చు విలువ సుమారు 425 కోట్ల రూపాయలు. ఈ ప్రయోగాన్ని 2018లో అమలు పరచాలని అనుకుంటున్నారు. ఈ ప్రయోగాన్ని జియోసింక్రనస్ సేటలైట్ లాంచ్ వెహికల్ (GSLV) వాహనం ద్వారాా ప్రయోగిస్తారు, ఇందులో భారత్ తయారు చేసిన లునార్ అర్బిటర్, రోవర్‌లను, రష్యా తయారు చేసిన లాండర్‌నూ ప్రయోగిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షించవచ్చు, కొత్త ప్రయోగాలూ చేయవచ్చు అని ISRO భావిస్తోంది. చక్రాలు కలిగిన రోవర్ యంత్రం చంద్రుని ఉపరితలం అంతా తిరిగి అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి అక్కడే రసాయన విశ్లేషణ చేస్తుంది. ఈ సమాచారము పరిభ్రమిస్తున్న చంద్రయాన్-2 ద్వారా భూమికి చేరవేయబడుతుంది.చంద్రయాన్-1ను సాకారం చేసిన మైలస్వామి అన్నాదురై నేతృత్వంలోని బృందం చంద్రయాన్-2 పైన పనిచేస్తుంది
2008 సెప్టెంబరు 18న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్అధ్యక్షతన జరిగిన కాబినెట్ మంత్రుల సమావేశంలో ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.
2007 నవంబరు 12లో రష్యన్ అంతరిక్ష సంస్థ (రాస్కోమోస్), ISRO ప్రతినిధులూ సంయుక్తంగా చంద్రయాన్-2 ప్రయోగంలో పాల్గొనాలి అని ఒప్పందం చేసుకున్నారు. రోవర్‌ను, అర్బిటర్‌నూ తయారు చేసే ప్రధాన బాధ్యత ఇస్రో తీసుకోగా, రాస్కోమోస్ లాండర్ని తయారు చేసే బాధ్యత తీసుకుంది. అంతరిక్ష వాహనం ఆకృతిని ఆగస్టు 2009లో పూర్తి చేసారు, రెండు దేశాల శాస్త్రవేత్తలు కలిపి ఈ నమునాను పరిశీలించారు
అంతరిక్ష వాహనం
శ్రీ హరి కోట ద్వీపం లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2650 కేజీలు బరువు ఉన్న జియో సింక్రనస్ సేటలైట్ లాంచ్ వెహికల్ ఏంకె-II (GSLV)ని ప్రయోగించాలని ప్రణాళిక తయారు చేసారు.
ఆర్బిటర్
ISRO ఆర్బిటర్ని రూపొందిస్తుంది, ఇది చంద్రునికి 200 కిలోమీటర్ల పైన కక్ష్యలో పరిభ్రమిస్తుంది.ఆర్బిటర్లో ఐదు రకాల ఉపగ్రహాలను పొందుపరచాలని నిర్ణయించారు. వీటిలో మూడు కొత్తవి, మిగతా రెండు చంద్రయాన్-1లో వాడిన పరికరాలే కానీ వాటిని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగుపరిచారు. ప్రయోగ బరువు సుమారు 1400 కేజీలు.
లాండర్
చంద్రయాన్-1 లోని చంద్రుని ఉపరితలాన్ని డికొనే చంద్ర శోధక యంత్రంలా కాకుండా ఈ లాండర్ సున్నితంగా దిగుతుంది.ది రష్యన్ ఫెడరల్ ఏజెన్సీ లాండర్ని సమకూరుస్తుంది. లాండర్, రోవర్ల బరువు సుమారుగా 1250 కేజీలు అని అంచనా వేయబడింది. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన రాస్కోమోస్ 2011లో లాండర్ని పరీక్షించాలని ప్రణాళిక చేస్తోంది.
రోవర్
రోవర్ 30-100 కేజీల మధ్య ఉంటుంది సౌరశక్తిని వినియోగిస్తుంది. ఈ రోవర్ చక్రాల సహాయంతో చంద్రుని ఉపరితలం పైన తిరుగుతూ నేల, రాళ్ల నమూనాలను సేకరిస్తుంది, వాటిని రసాయనిక విశ్లేషణ చేసి వాటి సమాచరాన్ని పైన పరిభ్రమిస్తున్న ఆర్బిటర్ కి చేరవేస్తుంది, అదే సమాచారాన్ని ఆర్బిటర్ భూమికి ప్రసారం చేస్తుంది
2010 ఆగస్టు 30 కల్లా ఇస్రో చంద్రయాన్-2 పేలోడ్లను ఖరారు చేసింది.
చందమామ దక్షిణ ధ్రువానికి రోవర్‌ను పంపుతున్న తొలి దేశం భారతే.ఇది గర్వించ తగ్గ విషయం.చంద్రయాన్-2 చంద్రుడి చుట్టూ తిరుగుతూ... చందమామను హెచ్‌డీ ఫొటోలు తీస్తూ... ఇస్రోకు పంపుతుంది.చంద్రయాన్-2 చంద్రుడి నుంచి చాలా సమాచారం కూడా భూమికి పంపిస్తుంది.ఈ మొత్తం ప్రాజెక్టుకు అయిన ఖర్చు రూ.978 కోట్లు.ఏది ఏమైనా చరిత్రలో నిలిచిపోయే ప్రయోగం ఇది. . ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపడతామో త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది.కాగా ఈ ప్రయోగాన్ని ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు . చంద్రయాన్-2లో మూడు పరికరాలు ఉన్నాయి. మొదటిది ఆర్బిటర్. . ఇది చంద్రుడి కక్ష్యలో చంద్రుడి చుట్టూ తిరుగుతుంది.మరొకటి ల్యాండర్. ఇది చంద్రుడి ఉపరితలం మీద దిగుతుంది.ఈ ల్యాండర్ రోవర్ అనే మూడో పరికరాన్ని బయటకు పంపుతుంది. అది చంద్రుడి మీద అన్వేషణ చేస్తుంది.భారతదేశం ఈ అంతరిక్ష నౌకలో 13 పరిశోధన పరికరాలు అమర్చింది. ఇవికాక.. నాసా పంపించిన మరొక పరికరాన్ని కూడా ఇది మోసుకెళుతుంది.. ఉచితంగా.చంద్రుడి మీద నీటి అణువుల జాడను పసిగట్టటం ద్వారా చంద్రయాన్-1 చరిత్ర సృష్టించింది.చంద్రయాన్-1కి కొనసాగింపుగా చంద్రయాన్-2ను ప్రయోగిస్తోంది ఇస్రో.
జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2:51 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించాల్సి ఉండగా.. సరిగ్గా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది.ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం వచ్చేవారం జరగనుంది.జూలై 22వ తేదీ మధ్యాహ్నం 2.43గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం 6.43గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు
*✨ చంద్రయాన్-2 కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభం*
★ చంద్రయాన్-2 ప్రయోగాన్ని 22వ తేదీ మధ్యాహ్నం 2:43 గంటలకు నిర్వహించనున్నట్లు ఇస్రో అధికారికంగా ప్రకటన.
★ ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది.
★ 20 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగనుంది.
★ చంద్రయాన్-2ను జీఎస్ఎల్వీ మార్క్-3 ఎం1 నింగిలోకి మోసుకెళ్లనుంది.
★ 3.8 టన్నుల బరువున్న చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని రోదసీలోకి బాహుబలి రాకెట్ తీసుకెళ్లనుంది.
★ చంద్రయాన్-2 ప్రయోగ వీక్షణకు విచ్చేసే ప్రజల సౌకర్యార్థం సూళ్లూరుపేట నుంచి షార్‌లోని విజిటర్స్ గ్యాలరీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
★ ఇలా ఉండగా చంద్రయాన్-2 ప్రయోగంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని సరిదిద్దడంలో ఇస్రోకు చెందిన విశ్రాంత శాస్త్రవేత్తలు కీలకపాత్ర పోషించారు.
🌿🌼🌸🌸🌼🌿
░▒▓█ CVPRASAD █▓▒░
శ్రీహరికోట, న్యూస్‌టుడే: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో జీఎస్‌ఎల్‌వీ-మార్క్3ఎం1 వాహకనౌక(రాకెట్) ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకువెళ్లనుంది. సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 2.43 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఉన్న రెండో ప్రయోగ వేదిక నుంచి చంద్రయాన్-2 ప్రయోగం జరగనుంది. ప్రయోగానికి ముందుగా జరిగే కౌంట్డౌన్ ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 20 గంటల పాటు కొనసాగి జీఎస్‌ఎల్‌వీ-మార్క్3ఎం1 నింగిలోకి వెళ్లనుంది. వాహకనౌక 3.8 టన్నుల బరువుగల చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.
ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన తరువాత 16.13 నిమిషాలపాటు ప్రయాణించి, నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించిన పిదప చంద్రయాన్-2 రాకెట్ నుంచి విడిపోతుంది. ఈ ప్రయోగాన్ని ఈ నెల 15వ తేదీ వేకువజామున చేపట్టాల్సి ఉండగా ప్రయోగానికి 56 నిమిషాల ముందు క్రయోజెనిక్ ట్యాంకర్‌లో సాంకేతిక లోపాన్ని గుర్తించి వాయిదా వేశారు. శాస్త్రవేత్తలు దీన్ని సరిచేసి, సోమవారం ప్రయోగానికి సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇస్రోలోని అన్ని విభాగాల సంచాలకులు, సీనియర్ శాస్త్రవేత్తలు, విశ్రాంత శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని పర్యవేక్షించేందుకు షార్‌కు చేరుకున్నారు.
సవాళ్లతో కూడిన ప్రయోగం
చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి ప్రవేశ పెట్టడమనేది అత్యంత సవాల్‌తో కూడిన పని. ఇస్రో సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరుకుంటున్న అతి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానమిది. ఇస్రో చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేస్తున్న మొదటి ప్రయత్నమూ ఇది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోయిన తరువాత 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.
14 రోజుల పాటు పరిశోధన
చంద్రుడిపై దిగనున్న రోవర్ సెకనుకు సెంటీమీటరు వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి.. ఆ సమాచారాన్ని, చిత్రాలను పంపించనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేస్తుంది.
లాంచ్ విండో 1 నిమిషమే..
‘చంద్రయాన్-2’ను నింగిలోకి పంపేందుకు సోమవారం కేవలం ఒక నిమిషం ‘లాంచ్ విండో’ అందుబాటులో ఉంది. అయినప్పటికీ ఆ తక్కువ నిడివిలోనే విజయవంతంగా ప్రయోగం పూర్తిచేస్తామని ఇస్రో సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. తాము గత 20 ప్రయోగాలను అనుకున్న సమయానికే అత్యంత కచ్చితత్వంతో పూర్తిచేసిన సంగతిని సంస్థ గుర్తుచేస్తోంది. ఈ నెల 15 తెల్లవారుజామున చంద్రయాన్-2ను నింగిలోకి పంపేందుకు 10 నిమిషాల లాంచ్ విండో అందుబాటులో ఉన్నప్పటికీ ఆ రోజు ప్రయోగం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ రోజు(15న) మినహా ఈ నెల ఇతర రోజుల్లో ఒక నిమిషం నిడివి ఉన్న లాంచ్ విండోలే అందుబాటులో ఉన్నాయి.
చంద్రయాన్-2లో 30 శాతం మంది మహిళలే!
ప్రతిష్ఠాత్మక ‘చంద్రయాన్-2’ బృందంలో దాదాపు 30 శాతం మంది మహిళలే ఉన్నట్లు ‘ఇస్రో’ వర్గాలు వెల్లడించాయి. కీలక
బాధ్యతలనూ మహిళలు చేపట్టడం విశేషం. ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎం.వనిత, మిషన్ సంచాలకులుగా రీతు కరిధాల్‌లు కీలక బాధ్యతలు నిర్వహించారు
ఇస్రో చేపడుతున్న చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో భారత్ ప్రత్యేక ముద్ర వేస్తుంది. చంద్రయాన్-1లో చంద్రునిపై ఉన్న నీటి జాడలు గుర్తించగలిగాం. ఇప్పుడు చంద్రయాన్-2 ద్వారా చంద్రునిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, జాబిల్లి పుట్టుక, నీరు, ఇతర మూలకాల గురించి లోతుగా తెలుసుకునే ఆస్కారమేర్పడుతుంది.
0 Response to "చంద్రయాన్ 2 ప్రయోగాన్ని విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం"
Post a Comment