SBI పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ గురించి తెలుసుకోండి
1
పెట్టుబడి లిమిట్
ఏడాదికి కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు పీపీఎఫ్ అకౌంట్‌లో డిపాజిట్ చేయవచ్చు. ఖాతాదారు సంవత్సరానికి లక్షన్నరకు మించి డిపాజిట్ చేయరాదు.
2
వడ్డీ రేటు
కేంద్ర ప్రభుత్వం మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను సవరిస్తుంది. ఆ వడ్డీ రేట్లను ఎస్బీఐ వర్తింప చేస్తుంది. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు ఏడాదికి 8.0 శాతంగా ఉంది. వడ్డీని ప్రతి నెల 5వ తేదీ నుంచి లెక్కిస్తారు. దీనిని ప్రతి ఏడాది మార్చి 31వ తేదీన చెల్లిస్తారు
3
మెచ్యూరిటీ పీరియడ్
మెచ్యూరిటీ పీరియడ్ 15 ఏళ్లుగా ఉంది. అయితే అప్లికెంట్ ఆ తర్వాత దీనిని మరో ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు పెంచుకోవచ్చు. ఎస్బీఐ పీపీఎఫ్ అకౌంట్‌కు ఆదాయపన్ను చట్టం సెక్షన్ 88 కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. వడ్డీ సహా మొత్తంపై ఆదాయ పన్ను పరిమితి వర్తిస్తుంది. ఎస్బీఐ పీపీఎఫ్ అకౌంట్ మొత్తాన్ని అయిదేళ్ల పీరియడ్ తర్వాత షరతుల కింద మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంది
0 Response to "SBI పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ గురించి తెలుసుకోండి"
Post a Comment