Intermediate Students Ammavadi

Intermediate

ఇంటర్‌ విద్యార్థులకు ‘అమ్మఒడి’ వర్తింపు


అమరావతి: అమ్మఒడి పథకం ఒకపై ఇంటర్‌ విద్యార్థులకు వర్తించనుంది. విద్యాశాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘అమ్మఒడి’ పథకాన్ని ఇంటర్‌ విద్యార్థులకు వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుందన్నారు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి తల్లికీ ఏటా రూ. 15 వేలు అందజేస్తామని జగన్‌ స్పష్టం చేశారు. 

పాఠశాలల్లో ప్రతి 20 నుంచి 25 విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నందున ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. వర్శిటీల్లోని అన్ని ఖాళీలను ఈ ఏడాది చివరికల్లా భర్తీ చేయాలన్నారు. 30 రోజుల్లోగా ఉపకులపతులను ఎంపిక చేయాలని అధికారులకు తెలిపారు. వీరి ఎంపికకు తక్షణమే సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అత్యంత అర్హత, అనుభవం ఉన్న వారినే ఉపకులపతులుగా తీసుకోవాలన్నారు. 


Students


Ammavadi


Also eligible



Implementation


Cm announced




CVPRASAD



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Intermediate Students Ammavadi"

Post a Comment