*రేపటి నుంచి..ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
*రేపటి నుంచి..ఇంజనీరింగ్ కౌన్సెలింగ్*
*6 వరకు సర్టిఫికెట్ల పరిశీలన*
*3 నుంచి 8 వరకు ఆప్షన్లు*
*11న సీట్ల కేటాయింపు*
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్(ఎంపీసీ) అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియ సోమవారం(రేపు) ప్రారంభం కానుంది. ఎంసెట్-2019లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు రాష్ట్రంలోని యూనివర్సిటీ, ప్రైవేట్ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో సీట్ల కోసం వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి ఈ నెల 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం జూలై 1 నుంచి 6వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 3 నుంచి 8 వరకు ఆప్షన్ల నమోదు చేపడతారు. జూలై 9న ఆప్షన్లలో మార్పులు చేసుకునే అవకాశం కల్పించారు. 11న సీట్ల కేటాయింపు జరుగుతుంది. అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో పాల్గొనే వారు జూలై 8లోగా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1200(ఓసీ/బీసీ), రూ.600(ఎస్సీ/ఎస్టీ) చెల్లించాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ముందుగానే 1 నుంచి ఆఖరు ర్యాంకరు వరకు ప్రాసెసింగ్ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
*♦అందుబాటులో సమాచారం*
సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా http://apsche.org/cetstatus.php పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. ప్రాసెసింగ్ ఫీజును చెల్లించే ముందు ఈ పోర్టల్‌లో సర్టిఫికెట్ల పరిశీలన స్థాయిని తెలుసుకోవచ్చు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కాని అభ్యర్థులు హెల్ప్‌లైన్ సెంటర్ల(హెచ్‌ఎల్‌సీ)ను సంప్రదించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 24 హెచ్‌ఎల్‌సీలను ఏర్పాటు చేశారు.
*♦సమర్పించాల్సిన సర్టిఫికెట్లు*
ఫ ఏపీ ఎంసెట్-2019 ర్యాంక్ కార్డ్ ఫ ఏపీ ఎంసెట్-2019 హాల్ టికెట్ ఫ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్(ఇంటర్ లేదా దానికి సమానం) ఫ డేటాఫ్ బర్త్ సర్టిఫికెట్(ఎ్‌సఎ్‌ససీ లేదా సమానం) ఫ 6 నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్ ఫ రెసిడెన్స్ సర్టిఫికెట్.. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్‌కు 7 సంవత్సరాలకు ముందు నుంచి ఫ తల్లి/తండ్రికి సంబంధించి 10 సంవత్సరాల ఏపీ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఫ ఆధార్ కార్డు ఫ ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఫ ఇన్‌కం సర్టిఫికెట్ ఫ లోకల్ స్టేటస్ సర్టిఫికెట్.
CLICK HERE TO OFFICIAL WEBSITE
వెరిఫికేషన్ షెడ్యూల్
తేదీ ర్యాంకు
1 1-10,000
2 10,001-30,000
3 30,001-50,000
4 50,001-75,000
5 75,001-1,00,000
6 1,00,001 నుంచి మొత్తం
ఆప్షన్ల ఎంట్రీ షెడ్యూల్
తేదీ ర్యాంకు
3-4 1-30,000
5-6 30,001-75,000
7-8 75,001 నుంచి మొత్తం
9 ఆప్షన్లలో మార్పులు
11 సీట్ల కేటాయింపు
0 Response to "*రేపటి నుంచి..ఇంజనీరింగ్ కౌన్సెలింగ్"
Post a Comment