కలెక్టర్‌ కూతురు.. సర్కారీ బడికి

వికారాబాద్‌ కలెక్టరేట్‌: చిన్న చిన్న కొలువుల్లో ఉండేవారు.. కూలి చేసుకొనే వారు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించేందుకు అంతగా ఇష్టపడని రోజులివి. అప్పుచేసైనా సరే పిల్లల్ని ప్రైవేటు బడులకు పంపితే చాలనుకుంటున్నారు

 తప్ప సర్కారీ పాఠశాలలకు పంపేందుకు ఆసక్తిచూపడం లేదు. చివరకు ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులదీ అదే దారి. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన అంతంతమాత్రమేనన్న అభిప్రాయం వారిలో నెలకొనడమే ఈ పరిస్థితికి కారణం కావొచ్చు. 


కానీ, వికారాబాద్‌ కలెక్టర్‌ మస్రత్‌ ఖానం అయేషా మాత్రం విభిన్నంగా ఆలోచించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లా పరిపాలనాధికారి హోదాలో ఉన్న ఆమె తన కుమార్తెను ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించి తన ఆదర్శాన్ని, ప్రభుత్వ పాఠశాలల పట్ల తనకున్న విశ్వాసాన్ని చాటుకున్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో అయేషా తన కుమార్తెను ఐదో తరగతిలో చేర్పించారు. 


గతంలో ఖమ్మం జిల్లాలోని ఓ ప్రయివేటు పాఠశాలలో నాలుగో తరగతి చదివిన తన కుమార్తె సబీష్‌ రాణియాను డేస్కాలర్‌గా చేర్పించారు.ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి సేవలు అందిస్తున్నారని
తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కలెక్టర్‌ కూతురు.. సర్కారీ బడికి"

Post a Comment