డీఎస్సీ పోస్టుల భర్తీకి ప్రాథమిక షెడ్యూల్ విడుదల
*📚✍డీఎస్సీ పోస్టుల భర్తీకి ప్రాథమిక షెడ్యూల్ విడుదల*
*♦మొదట ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీ*
*♦సెప్టెంబరు 4తో ముగియనున్న ప్రక్రియ*
*🌻ఈనాడు - అమరావతి*
డీఎస్సీ-2018కి సంబంధించిన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక షెడ్యూల్‌ను రూపొందించింది. మొదటిసారిగా ఆన్‌లైన్‌లో డీఎస్సీ నిర్వహించిన విద్యాశాఖ ఎన్నికలకు ముందు ఫలితాలను విడుదల చేసి, మెరిట్ జాబితాను ప్రకటించింది. పోస్టుల భర్తీకి తాజాగా ప్రభుత్వ అనుమతి లభించడంతో ప్రాథమిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో మొదట ఆదర్శపాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలల ప్రిన్సిపాళ్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. అనంతరం పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్స్(పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ), స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులను నింపనున్నారు. భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులపై న్యాయస్థానం ఆదేశాలున్నందున వీటి భర్తీని చేపట్టడం లేదు. ప్రిన్సిపల్ పోస్టులు రాష్ట్రస్థాయివి కాగా.. పీజీటీ, టీజీటీ జోనల్ స్థాయి పోస్టులు. ఇక స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ పోస్టులు జిల్లాస్థాయి ఉద్యోగాలుగా భర్తీచేయనున్నారు.
*👉షెడ్యూల్ ఇలా..👇*
*▪మొత్తం అన్ని రకాల పోస్టులు కలిపి 7,902 వరకు భర్తీ చేయనున్నారు.*
అభ్యర్థులు పోస్టింగ్ సమయంలో ఐచ్ఛిక ప్రాంతాలను సూచించకపోతే సభ్య, కార్యదర్శే పోస్టింగ్ కేటాయిస్తారు.
*♦ప్రిన్సిపాళ్ల పోస్టుల షెడ్యూల్..*
* ఈనెల 20న పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఎంపిక అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. దాన్ని 21న ఎంపిక కమిటీ నిర్ధారించాల్సి ఉంటుంది.
* 22, 23 తేదీల్లో అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
* 24, 25 తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.
* జులై 4న తుది ఎంపిక జాబితాను విడుదల చేస్తారు. 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు.
* 7న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు.
*♦పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్..*
ఆదర్శ పాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ సొసైటీల్లో పీజీటీ పోస్టులు భర్తీచేయనున్నారు.
* ఈనెల 27న ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. 29, 30న అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను ఆప్‌లోడ్ చేయాలి.
* జులై 11న ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 12, 13న వెబ్ ఆప్షన్లు. 14న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు.
*♦ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్(టీజీటీ)*
ఆదర్శ పాఠశాలలు, ఏపీ బీసీ సంక్షేమ పాఠశాలలు, ఏపీరెసిడెన్షియల్ సొసైటీల్లో టీజీటీ పోస్టులు భర్తీచేయనున్నారు.
* జులై 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. 13, 14న అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాలి. 27న తుది జాబితా ప్రకటిస్తారు.
* 28, 29న వెబ్ ఆప్షన్లు. ఆగస్టు 1న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు.
*♦స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు..*
అన్ని రకాల స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు జులై 17న అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
* 20, 21న అభ్యర్థులు విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
* ఆగస్టు 1న తుది జాబితా ప్రకటన. 2, 3న వెబ్ ఆప్షన్లు. 5న పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారు.
*♦సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ)*
* ఆగస్టు 2న అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటన
* 6, 7 తేదీల్లో విద్యార్హత ధ్రువీకరణ పత్రాల అప్‌లోడ్
* 29న తుది జాబితా ప్రకటన. ఆగస్టు 30, సెప్టెంబరు1న వెబ్ ఆప్షన్ల నమోదు
* సెప్టెంబరు 4న పోస్టింగ్ ఆర్డర్లు జారీ.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
0 Response to "డీఎస్సీ పోస్టుల భర్తీకి ప్రాథమిక షెడ్యూల్ విడుదల"
Post a Comment