వైఫైతో ఫోన్‌ ఛార్జింగ్‌...

వైఫైతో ఫోన్‌ ఛార్జింగ్‌...! ఇప్పుడు ఛార్జర్‌ అవసరంలేని ఫోన్లు వచ్చేస్తున్నారు మరి! వైఫై సిగళ్ల ఆధారిత విద్యుత్‌ని పంపే సరికొత్త సాంకేతికతను వీరు కనిపెట్టారు. ఈ వైఫై ఎలక్ట్రిసిటీ వ్యవస్థ ద్వారా బ్యాటరీల అవసరం లేకుండానే రిమోట్‌ సెన్సార్లు, 


ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ను ఆపరేట్‌ చేయవచ్చంటున్నారు. సెమీ కండక్టర్‌ మెటీరియల్‌ ద్వారా రూపొందించిన రేడియో యాంటెన్నా.. వైఫై సిగళ్లను గ్రహించి వైర్‌లెస్‌ ఎనర్జీగా మార్చేస్తుంది. ఈ యాంటెన్నాకు 'రెక్టెన్నా' అని పేరుపెట్టారు.

 ఏసీ సిగళ్లు సెమీ కండక్టర్‌ ద్వారా ప్రవహించడం వల్ల అది డీసీ ఓల్టేజ్‌గా మారుతుంది. దీన్ని పవర్‌ ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లకు లేదా బ్యాటరీల రీఛార్జ్‌కు ఉపయోగించవచ్చు.



ఈ విషయాన్ని ఎంఐటీ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "వైఫైతో ఫోన్‌ ఛార్జింగ్‌..."

Post a Comment