గూగుల్‌ మ్యాపుల్లో స్పీడోమీటర్‌

దిక్సూచి 

ఎటు వెళ్లాలన్నా గూగుల్‌ మ్యాప్‌ సాయం తీసుకుంటున్నాం. ట్రాఫిక్‌ ఇబ్బందుల నుంచి తప్పించుకుంటున్నాం. 




ఇప్పుడు మరో సరికొత్త సౌకర్యంతో గూగుల్‌ మ్యాప్‌ ప్రయాణాన్ని సురక్షితం చేస్తోంది. అదేంటంటే.. స్పీడోమీటర్‌. డ్యాష్‌బోర్డుపై మొబైల్‌ హోల్డర్‌కి అమర్చుకుని గూగుల్‌ మ్యాప్‌ సాయంతో ప్రయాణిస్తున్నట్లయితే నేవిగేషన్‌ స్క్రీన్‌పై స్పీడో మీటర్‌ కనిపిస్తుంది.


 వెళ్తున్న రూటుపై నిత్యం మీ వేగాన్ని స్పీడోమీటర్‌ అంచనా వేస్తుంది. వేగం మితి మీరుతుందో వెంటనే అలర్ట్‌ చేస్తుంది. సురక్షిత ప్రయాణానికి ఇదో రక్షణ వ్యవస్థ అనుకోవచ్చు.


ఇప్పటికే కొన్ని దేశాల్లో కొత్త ఫీచర్‌ అందుబాటులో ఉంది.

ఇంకా ఏమున్నాయ్‌? 
* మెట్రో నగరాల్లో బస్సు ప్రయాణాన్ని సౌకర్యంగా ప్లాన్‌ చేసుకునేలా 'బస్సు ప్రయాణ వేళల్ని' లైవ్‌లో చూపిస్తుంది. అప్పటికి ఉన్న ట్రాఫిక్‌ ఆధారంగా అందుబాటులో ఉన్న బస్సులు మీరు ఉన్న స్టాప్‌కి ఎంత సమయానికి చేరుకుంటాయో తెలుసుకోవచ్చు. 



* 'లైవ్‌ ట్రైన్‌ టైమింగ్స్‌' ఆప్షన్‌తో రైళ్ల రాకపోకల వివరాల్ని లైవ్‌లో చూడొచ్చు. ఉదాహరణకు మీరు ఎక్కాల్సిన రైలు ఎక్కడ ఉందో లైవ్‌లో చెక్‌ చేసుకోవచ్చు. స్టేషన్‌కి ఎంత సేపట్లో వస్తుందో తెలుసుకోవచ్చు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గూగుల్‌ మ్యాపుల్లో స్పీడోమీటర్‌"

Post a Comment