విద్యాహక్కు చట్టాన్ని నూరు శాతం అమలు
అమరావతి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరు శాతం అమలు చేస్తామని ఏపి సియం జగన్ స్పష్టం చేశారు. అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ కూడా ఒకటన్నారు. ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సియం సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అభివృద్ది చేస్తామని జగన్ వివరించారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని, తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తామన్నారు.
విద్యార్ధులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు సకాలంలో అందిస్తామని ,వీలైతే ఈ సంవత్సరం నుంచి షూ కూడా ఇవ్వాలనే ఆలోచన ఉందని
తెలిపారు. గత ప్రభుత్వంలో ఏకరూప దుస్తుల కొనుగోలులో అవినీతి జరిగిందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు

0 Response to "విద్యాహక్కు చట్టాన్ని నూరు శాతం అమలు"
Post a Comment