ఇదీ గ్రామ సచివాలయం 12 శాఖలకు సంబంధించి సేవలు అందుబాటులో 10 మంది సిబ్బంది ఊరూరా మహిళా పోలీసు సహాయకులు, డిజిటల్‌ అసిస్టెంట్లు, గ్రామీణ ఇంజినీర్ల నియామకం

 

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని అత్యధిక గ్రామ పంచాయతీల్లో మహిళా పోలీసు సహాయకులు రాబోతున్నారు. వీరికి తోడుగా డిజిటల్‌ అసిస్టెంట్‌, సంక్షేమ సహాయకులు, గ్రామీణ ఇంజినీర్ల నియామకానికి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విధంగా గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సర్కారు కార్యాచరణ సిద్ధం చేసింది.

మొత్తం 13,065 గ్రామ పంచాయతీలకు సంబంధించి 9,500 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉందని లెక్కగట్టారు. ఒక్కో సచివాలయంలో మొత్తం 12 శాఖలకు సంబంధించిన సేవలు అందించేందుకు 10 మంది సిబ్బంది ఉండేలా అధికారులు ప్రణాళిక తయారు చేశారు.



గ్రామ సచివాలయాల్లో వివిధ శాఖల నుంచి ఎంత మంది సిబ్బంది అవసరం, ప్రస్తుతం అందుబాటు ఉన్నది ఎంత మంది? ఖాళీలు ఎన్ని ఉన్నాయన్న వివరాలు కూడా రూపొందించారు



SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఇదీ గ్రామ సచివాలయం 12 శాఖలకు సంబంధించి సేవలు అందుబాటులో 10 మంది సిబ్బంది ఊరూరా మహిళా పోలీసు సహాయకులు, డిజిటల్‌ అసిస్టెంట్లు, గ్రామీణ ఇంజినీర్ల నియామకం"

Post a Comment