ఎన్నికల ఫలితాలు యూట్యూబ్‌ లైవ్‌లో

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు విడుదలకానున్న సందర్భంగా ఫలితాలను ప్రసారం చేసేందుకు ప్రసార భారతి, గూగుల్‌ సంస్థలు చేతులు కలిపాయి. 


రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం లైవ్‌స్ట్రీమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వార్తా విశ్లేషణ, చర్చల కార్యక్రమాలను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసే అంశంపై ఇరు సంస్థలు ఒప్పదం చేసుకున్నాయి. 


గురువారం రోజు యూట్యూబ్‌ వెబ్‌సైట్‌, యాప్‌లలో పతాక శీర్షికన డీడీన్యూస్‌ఎన్నికల ఫలితాల సమాచారం లింక్‌ను ప్రదర్శిస్తారు

CLICK HERE TO LIVE COUNTING RESULTS

. ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే డీడీ న్యూస్‌ లైవ్‌ యూట్యూబ్‌ ఛానెల్‌ ఓపెన్‌ అవుతుంది. దాంతో పాటు పలు ఇతర భాషల్లో ప్రసారాలను వీక్షించేందుకు 14 డీడీ రీజియనల్‌ స్టేషన్ల లైవ్‌స్ట్రీమ్‌ ఆప్షన్‌ కూడా ఉందని ప్రసారభారతి ఒక ప్రకటనలో పేర్కొంది


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఎన్నికల ఫలితాలు యూట్యూబ్‌ లైవ్‌లో"

Post a Comment