నేడు తెలంగాణ ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల... ఇలా తెలుసుకోండి
ఆ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కాబోతున్నాయి. తెలంగాణ హైకోర్టు ఆదేశంతో ఇవాళ ఫలితాల్ని విడుదల చేస్తోంది ఇంటర్ బోర్డు. రీవెరిఫికేషన్ రిజల్ట్స్‌తోపాటూ... స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసిన ఆన్సర్ షీట్ల స్కానింగ్ కాపీలను కూడా వెబ్‌సైట్‌లో పెడుతున్నారు. తద్వారా ఏ ఆన్సర్‌కి ఎన్ని మార్కులు వచ్చాయో, ఎలా వాల్యుయేషన్ చేశారో ఈజీగా తెలుసుకోవచ్చు.
విద్యార్థులే స్వయంగా కౌంటింగ్ చేసుకొని, ఎన్ని మార్కులు వచ్చాయో ఎలాంటి అనుమానాలూ లేకుండా తెలుసుకోవచ్చు. ఇంటర్‌బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాల్ని చూసుకోవచ్చు
.విద్యార్థులు హాల్‌టికెట్ నెంబరు ఎంటర్ చేసి... స్కానింగ్ కాపీలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఈ వెబ్ సైట్ (http://bie.telangana.gov.in) లోకి వెళ్లండి. లేదా (http://exam.bie.telangana.gov.in/Results/Home.html) లోకి వెళ్లండి. లేదంటే T App Folio అనే యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌లో తప్పిదాలతో 3.18 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. రీవెరిఫికేషన్ చెయ్యాలని హైకోర్టు ఆదేశించింది.
అలా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ పూర్తి చేసిన అధికారులు... ఇవాళ రిజల్ట్స్‌తోపాటూ... ఆన్సర్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచున్నారు.
CLICK HERE TO DOWNLOAD RESULTS APP
రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలతోపాటు ఆన్సర్ షీట్ల స్కానింగ్ కాపీలను కూడా స్టూడెంట్స్ ఇవాళ్టి నుంచీ పొందొచ్చు.షెడ్యూలు ప్రకారం జూన్ 7 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.
వీటికి సంబంధించిన హాల్‌టికెట్లను కాలేజీల వెబ్ సైట్లలో మే 25 నుంచీ అందుబాటులో ఉంచారు. కాలేజీల ప్రిన్సిపల్స్ వాటిని డౌన్ లోడ్ చేసి, స్టూడెంట్లకు ఇవ్వాలి. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది.
CLICK HERE TO DOWNLOAD RESULTS
జూన్ 7న మొదలయ్యే సప్లిమెంటరీ ఎగ్జామ్స్... జూన్ 14 వరకూ జరుగుతాయి. వాటి ఫలితాలు కూడా వీలైనంత త్వరగా ఇచ్చేలా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంటర్ బోర్డ్ అధికారులు
0 Response to "నేడు తెలంగాణ ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల... ఇలా తెలుసుకోండి"
Post a Comment