ఈ-సువిధ యాప్‌లో ఎన్నికల ఫలితాలు
ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ఈ-సువిధ యాప్‌లో అప్‌లోడ్ చేయనున్నారు
. దీంతో ముందుగానే ఆన్‌లైన్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. 23న ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. హైదరాబాద్ పరిధిలోని రెండు లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు కోసం14 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ సిబ్బందికి 22న తుది శిక్షణ ఇవ్వనున్నారు. 23న ఉదయం 6 నుంచి 24 గంటల పాటు నగరంలో 144సెక్షన్ అమల్లో ఉంటుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి దానకిశోర్ తెలిపారు.
కౌంటింగ్ ప్రారంభమైన మొదటి అర్ధగంటలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని, అనంతరం ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారని చెప్పారు.
రౌండ్లవారీగా ఎన్నికల ఫలితాలను ఈ-సువిధ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయనున్నట్లు, ఆ తరువాతే ఫలితం వెల్లడిస్తామన్నారు
దీనివల్ల తాము ప్రకటించడానికి ముందుగానే ప్రజలు ఆన్‌లైన్‌లో చూసుకునే వీలు కలుగుతుందన్నారు
0 Response to "ఈ-సువిధ యాప్‌లో ఎన్నికల ఫలితాలు"
Post a Comment