కౌంట్ డౌన్ : ఏపీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే
విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ ఓట్ల లెక్కింపును శివానీ ఇంజినీరింగ్ కళాశాలలో,
విజయనగరం పార్లమెంట్‌లోని మిగిలిన 4 అసెంబ్లీ స్థానాల ఓట్లు ఎంజీవీఆర్ కళాశాలలో లెక్కించనున్నారు.
విశాఖపట్నం, అరకు, అనకాపల్లి ఎంపీ స్థానాల పరిధిలోని ఓట్ల లెక్కింపునకు ఆంధ్రాయూనివర్శిటీలో ఏర్పాట్లు చేశారు.
కాకినాడ పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఆదికవి నన్నయ యూనివర్శిటీలో
, అమలాపురం పార్లమెంట్, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ ఓట్ల లెక్కింపు అమలాపురం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ప్రాంగణంలో,
రాజమండ్రి పార్లమెంట్, దాని పరిధిలోని అసెంబ్లీ ఓట్ల లెక్కింపు సిటీ ఐడియల్ కాలేజ్,
ఏలూరు పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఓట్లు కౌంటింగ్ రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజ్,
నర్సాపురం పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ విష్ణు డెంటల్ కాలేజ్‌లో జరగనుంది.
మచిలీపట్నం పార్లమెంట్, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ కృష్ణా యూనివర్శిటీలో,
విజయవాడ లోక్‌సభ, దాని పరిధిలోని అసెంబ్లీ ఓట్ల లెక్కింపునకు ధనేకుల ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏర్పాట్లు పూర్తి చేసిందిఈసీ.
గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఓట్లు లెక్కింపు నాగార్జున యూనివర్శిటీ,
నర్సరావుపేట లోక్‌సభ పరిధిలోని ఓట్ల లెక్కింపు లయోలా పబ్లిక్ స్కూల్‌లో జరగనుంది
. బాపట్ల లోక్‌సభ, దాని పరిధిలోని అసెంబ్లీ స్థానాల లెక్కింపును పేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
ఒంగోలు పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్ టంగుటూరులోని కృష్ణా పాలిటెక్నిక్ కాలేజ్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు.
నంద్యాల పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల ఓట్లు రాయలసీమ యూనివర్శిటీ,
కర్నూలు లోక్‌సభ ఓట్ల లెక్కింపు రవీంద్ర ఇంజినీరింగ్ కాలేజ్, పుల్లయ్య ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరగనుంది.
అనంతపురం పార్లమెంట్ ఓట్ల లెక్కింపు JNTU ఇంజినీరింగ్ కాలేజ్,
హిందూపురం లోక్‌సభ ఓట్ల కౌంటింగ్ SK యూనివర్శిటీ,
కడప పార్లమెంట్‌తో పాటు రాజంపేటలోని మూడు అసెంబ్లీ స్థానాల లెక్కింపు కేఎల్‌ఎం ఇంజినీరింగ్ కాలేజ్,
మరో నాలుగు ఆసెంబ్లీ స్థానాల కౌంటింగ్ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్ లో జరగనుంది.
నెల్లూరు పార్లమెంట్ ఓట్ల లెక్కింపు డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో జరగనుంది.
తిరుపతి పార్లమెంట్‌లోని సర్వేపల్లి, గూడురు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రియదర్శిని కళాశాల,
తిరుపతి అసెంబ్లీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ స్థానాల కౌటింగ్ ఆర్కేఎం లా కాలేజ్, చిత్తూరు లోక్‌సభ పరిధిలోని ఓట్లను శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్కించనున్నారు
0 Response to "కౌంట్ డౌన్ : ఏపీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఇవే"
Post a Comment