ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల వాయిదా

 ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల వాయిదా పడింది. రేపు విడుదల కావాల్సిన ఈ పరీక్ష ఫలితాలను వాయిదా వేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. తెలంగాణలో ఫెయిలైన ఇంటర్‌ విద్యార్థుల రీవాల్యుయేషన్‌ ఫలితాల తర్వాతే ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితాల విడుదల తేదీని తర్వలో ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ఓ ప్రకటనలో స్పష్టంచేసింది.

హైదరాబాద్‌, ఏపీలో 115 పరీక్షా కేంద్రాల్లో ఇంజినీరింగ్‌, వ్యవసాయ, వైద్యవిద్యలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలకు 2,82,901 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో ఇంజినీరింగ్‌కు 1,85,711 మంది, వ్యవసాయ, వైద్యవిద్య పరీక్షలకు 81,916 మంది విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే



SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల వాయిదా"

Post a Comment