26 వరకు 'గ్రూప్-3' సెంటర్ల మార్పు
అమరావతి: గ్రూప్-3 సర్వీసెస్ (పంచాయతీ సెక్రటరీ- గ్రేడ్-4) స్ర్కీనింగ్ టెస్ట్‌కు హాజరైన అభ్యర్థులు తాజాగా సెంటర్ మార్పు కోరుతూ తమకు అభ్యర్థనలు పంపుతున్నారని,
కానీ అది స్థానిక జిల్లానా, నాన్‌లోకల్ జిల్లానా అనేది తెలుసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది.
పంచాయతీ కార్యదర్శుల పోస్టులు జిల్లా స్థాయి పోస్టులని గమనించాలని అభ్యర్థులకు హితవు పలికింది. ఏ అభ్యర్థి అయినా సొంత జిల్లాలోనే లోకల్ అభ్యర్థిగా పరిగణించబడతాడని, ఇతర జిల్లాలోని సెంటర్‌కు మార్చుకుంటే నాన్‌లోకల్‌గా పరిగణిస్తామని స్పష్టం చేసింది.
సెంటర్‌ను బట్టి మెయిన్స్‌కు ఎంపిక ఆధారపడి ఉంటుందని వివరించింది. అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈనెల 26లోగా సెంటర్‌ను, సెంటర్/జిల్లా మార్పు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది
0 Response to "26 వరకు 'గ్రూప్-3' సెంటర్ల మార్పు"
Post a Comment