సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల 543 లోక్‌సభ, నాలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
543 లోక్‌సభ, నాలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా తొమ్మిది విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.
చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, కమిషనర్లు అశోక్ లావాసా, సుశీల్ చంద్ర ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. షెడ్యూలు ప్రకటించిన
మరుక్షణం నుంచి దేశవాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. లోక్ సభ 543 స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 175, ఒడిసా 147, సిక్కిం 32, అరుణాచల్ ప్రదేశ్ 60 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఎన్నికల కోడ్ అమలు:
543 లోకసభ స్థానాలకు ఎన్నికలు.
ఆంధ్రప్రదేశ్ లో175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.
లోక్‌సభ తో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీకికూడా ఎన్నికలు.
మొత్తం ఏడు విడతలుగా ఎన్నికలు.
ఎన్నికల తేదీలు: 18-3-2018 నుండి 19-5-19
First phase 11-4-19
Second phase18-4-19
Third phase 23-4-19
Fourth phase 29-4-19
Fifth phase 6-5-19
Sixth phase 12-5-19
Seventh phase 19-5-10
23-5-19 న కౌంటింగ్
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో లో ఒకే విడత లో పోలింగ్.
తేదీ: మొదటి విడత అనగా 11-4-19.
తక్షణం ఎన్నికల నియమావళి అమలులోకి.
ఎలాంటి ప్రభుత్వ కార్యక్రమాలలోకి రాజకీయ నాయకుల మరియు ప్రజాప్రతినిధుల జోక్యం కూడదు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే ప్రభుత్వ ఉద్యోగులపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు.
పాలన అంతా అధికారుల చేతికి.
ఎన్నికలకి ఐదు రోజుల ముందు ఓటర్లకు ఓటర్ స్లిప్పుల పంపిణీ.
ఎన్నికల టోల్ ఫ్రీ నంబర్ 1950 ద్వారా ఓటు చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ఫిర్యాదులు చెయ్యడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక యాప్ ని రూపొందించింది. ప్లేస్టోర్ నుండి డొన్ లోడ్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా 90 కోట్ల మంది ఓటర్లు.
పదిలక్షల పోలింగ్ కేంద్రాలు.
పాఠశాలల్లో ..పాఠశాల ప్రహారీలపై రాజకీయ నాయకుల ఫోటోలు...చిత్రాలు...పోస్టర్లు లేకుండా చూడండి.
0 Response to "సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల 543 లోక్‌సభ, నాలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు"
Post a Comment