గండికోట ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5, 6, 7 తేదీలలో విద్యార్థులకు వ్యాస, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు

All the DyEOs and MEOs are informed to conduct Essay Writing, Elocution and Painting competitions for children on 05.02.2019 Mandal Level, 06.02.2019 Divisional Level an occasion of "GANDIKOTA VAROTSAVALU" without fail. 

District Level will be conducted on 07.02.2019.

Topics:

Essay, Elocution : Gandikota Charitratmaka Prdhanyatha.

Painting : Gandikota Charitratmaka  Samskrutika Vaibhavam.


DEO, Kadapa.

 *గండికోట ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5, 6, 7 తేదీలలో విద్యార్థులకు వ్యాస, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు : జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ.* 

 కడప జిల్లాలో ఈ నెల 5, 6, 7 తేదీలలో ఆరు నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 

వ్యాస, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి శైలజ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 


ఈనెల 9, 10 తేదీలలో గండికోటలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గండికోట ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.

 ఈ ఉత్సవాలను పురస్కరించుకొని గండికోట ప్రాముఖ్యత, ఉత్సవాల విశిష్టత తెలియజేసేందుకు జిల్లాలోని విద్యార్థులందరికీ పోటీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు


. ఈ మేరకు ఈనెల 5న మండల విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో మండల స్థాయిలో, 6న ఉప విద్యాధికారుల పర్యవేక్షణలో డివిజన్ స్థాయిలో, 7న ఆర్ఎంఎస్ఏ ఉప విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణలో జిల్లాస్థాయిలో *గండికోట చారిత్రాత్మక ప్రాధాన్యత* అంశంపై వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తారని, అలాగే *గండికోట చారిత్రాత్మక సాంస్కృతిక వైభవం* అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

 మండల స్థాయిలో విజేతలైన వారికి డివిజన్ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారని, డివిజన్ స్థాయిలో విజేతలైన వారికి జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.


 జిల్లా స్థాయిలో ప్రధమ, ద్వితీయ స్థానాలలో గెలుపొందిన విద్యార్థులకు గండికోట ఉత్సవాల లో ముఖ్య అతిథుల చేతులమీదుగా బహుమతులు అందజేస్తారని తెలిపారు. 


ఎంఈవోలు, డిప్యూటీ డీఈవో లు, ఆర్ఎంఎస్ఏ డిప్యూటీ డీఈవో లందరూ పోటీల విజయవంతానికి కృషి చేయాలని డీఈవో ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


----------------------------//-----------------------------

సిహెచ్ పురుషోత్తం, ఏడి, సపౌశాఖ, కడప వారిచే జారీ చేయబడినది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "గండికోట ఉత్సవాలను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5, 6, 7 తేదీలలో విద్యార్థులకు వ్యాస, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు"

Post a Comment