సి.పి.బ్రౌన్ తెలుగు క్విజ్ పోటీలు

సి.పి.బ్రౌన్ తెలుగు క్విజ్ పోటీలు

<><><><><><><><><><>

*💁‍♂రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్థ. ఆంధ్రప్రదేశ్, అమరావతి*

*👉 సంచాలకులు ప్రస్తుతం: డి. మధుసుధనరావు, ఎమ్.ఎ. బి.ఎడ్.*

ప్రొసీడింగ్స్ నెం. 271/8/2018, తేది. 04.12.2018.


*✳ విషయము:    'దాసుభాషితం' - సి.పి. బ్రౌన్ వార్షిక తెలుగు క్విజ్ పోటీ - 2018" - విద్యార్థులలో మాతృ భాష మీద మక్కువ పెంపొందించటం - ద్వారా తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి కొరకు - పాఠశాలల్లో క్విజ్ నిర్వహణ - కొరకు - ఉత్తర్వులు.*


సందర్భం:  'దాసుభాషితం' నుంచి మెయిల్ ద్వారా 28, 11.2018 తేది లేఖ,

     <><><>

      సందర్భంలోని లేఖకు సంబంధించిన "సి.పి.బ్రౌన్ వార్షిక తెలుగు క్విజ్ పోటీ 2018" స్వరూప పత్రాన్ని జత చేస్తూ, “దాసుభాషితం" అను సాహితీ సంస్థ తెలుగు భాషాభివృద్ధికి, వ్యాప్తికి చేస్తున్న కృషిలో భాగంగా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లోని పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించ తలపెట్టిన తెలుగు క్విజ్ కార్యక్రమ వివరాలను తమ జిల్లాలోని అన్ని ఉన్నత పాఠశాలలకు తెలియజేస్తూ, నిర్వాహకుల సూచనల మేరకు పదవ తరగతి విద్యార్థులందరూ, తమ తమ పేర్లు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకుని, ఆన్ లైన్ ద్వారా సదరు క్విజ్ కార్యక్రమంలో పాల్గొని ప్రయోజనం పొంద వలసినదిగా సంబంధిత ప్రధానోపాధ్యాయులకు తగు ఆదేశాలు ఈయవలసినదిగా జిల్లా విద్యా శాఖాధికారులను ఇందుమూలముగా కోరడమైనది.

◼ఆన్లైన్ నమోదు కొరకు చివరి తేది - 10.12.2018

◼ఆన్లైన్ క్విజ్ నిర్వహించు తేది - 16.12.2018

పూర్తి వివరాల కొరకు  www.dasubhashitam.com/potee


సంచాలకులు

రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, అమరావతి


రాష్ట్రంలోని జిల్లా విద్యాశాఖాధికారులందరికీ,

ప్రతి: 'దాసుభాషితం' తెలుగు లలిత కళా వేదిక సెక్టార్ 5, బి 847 యన్టీవోస్ కాలనీ, వనస్థలిపురం,

హైదరాబాద్ 500070.  🙋‍♂

ఆన్ లై క్విజ్ నిర్వహణ

click here to download


ఆన్ లైన్ దరఖాస్తు 


మార్గదర్శకాలు విడుదల

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, వారికి పాఠం చెప్పే తెలుగు ఉపాధ్యాయులు, ఇంకా వారి పాఠశాల కూడా రూ. 30,000వరకూ నగదు బహుమతులు,  సత్కారాలు,  ప్రశంసా పత్రాలు గెలుచుకునే సువర్ణ అవకాశానికి స్వాగతం.

‘తెలుగు లలిత కళా వేదిక’ గా దాసుభాషితం, తెలుగు వారి కోసం సంగీత, కవిత్వ, నవల, కథల భాండాగారాన్ని ఆడియోద్వారా అందిస్తూ వస్తున్నదన్న విషయం చాలామందికి తెలిసిందే. 

తెలుగు రాష్ట్రాలలోని పదవ తరగతిలో ఉన్న బాల, బాలికలలో తెలుగు భాష మీద మమకారాన్ని మరింత పెంపొందించడానికి ఏదైనా చెయ్యాలని అనిపించి,  ఒక  వినూత్న కార్యక్రమం చేపట్టాం. తెలుగు వారు సదా స్మరించుకోవలసిన ఒక మహనీయుడి పేరు మీద పోటీ నిర్వహిస్తే బాగుంటుందని అనిపించింది.

విదేశీయుడై ఉండి,  ఉద్యోగరీత్యా భారత దేశానికి వచ్చి ఇక్కడ తెలుగు నేర్చుకోవడమే కాకుండా, అందులో పాండిత్యాన్ని సంపాదించి, తెలుగు నిఘంటువుతో సహా అనేక రచనలు చేసిన ఆంగ్లేయుడు, సి.పీ.బ్రౌన్.  ఆయన తెలుగు భాషా సాహితీ లోకానికే ఆదర్శప్రాయుడు. ఆ మహనీయుడిని స్మరించుకుంటూ తెలుగు బాలబాలికలకు ‘దాసుభాషితం’ ప్రతి యేడూ 'సి పీ బ్రౌన్ వార్షిక పాఠశాలల తెలుగు పోటీ' ని నిర్వహించాలని సంకల్పించింది

సివిప్రసాద్

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "సి.పి.బ్రౌన్ తెలుగు క్విజ్ పోటీలు"

Post a Comment